నర్సాపూర్: హాస్టల్లోని విద్యార్థులకు తక్షణమే కాస్మోటిక్ చార్జీలను చెల్లించాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ హాస్టల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించరు. ఈ సందర్భంగా వార్డెన్లు వారి వారి హాస్టల్ లో గల సమస్యలను, ఇబ్బందులను ఎమ్మెల్యే ముందు ఏకరువు పెట్టారు. అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. హాస్టల్లో అన్ని సదుపాయాలు సక్రమంగా ఉంటేనే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని సూచించారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలను అందించాలని వార్డెన్లకు సూచించారు. కిచెన్‌లో మెనూకు సంబంధించిన చాట్ ను ఏర్పాటు చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందివ్వాలని ఆదేశించారు. హాస్టల్లో డ్రైనేజ్, కాంపౌండ్ వాల్ తదితర సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి హాస్టల్‌కు మిషన్ భగీరథ కనెక్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం కొన్ని హాస్టల్లో మిషన్ భగీరథ కనెక్షన్ లేదని వాటిని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక తరగతులపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలన్నారు. ఇక మీదట ప్రతి హాస్టల్‌ను సందర్శిస్తానని, హాస్టల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. హాస్టల్లో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడవద్దని మీకు నేనున్నానని వార్డెన్ లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిటిడిఓ నీలిమ, మెదక్ ఏబిసడిఓ గంగ కిషన్, సంగారెడ్డి ఏబిసిడిఓ అమర జ్యోతి, ఎంఈఓలు తారా సింగ్, బుచ్చ నాయక్, ఏఎస్సిడిఓలు లింగేశ్వర్ పాల్గొన్నారు.