హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. బెల్లంపల్లిలోని బాబుఖాన్ బస్తీలో మూడు ఇండ్లలో చొరబడి మూడు తులాల బంగారం, 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, వరుస చోరీలతో బెల్లంపల్లి పట్టణ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు గస్తీని పెంచి నేరాలు జరగకుండా చూడాలని కోరుకుంటారు.
ఇవి కూడా చదవండి..
Mollywood Times | ప్రేమలు హీరో ‘మాలీవుడ్ టైమ్స్’.. రిలీజ్ డేట్ ఖరారు చేసిన మేకర్స్