న్యూఢిల్లీ: ఒక పక్క ఏఐ (కృత్రిమ మేధ) సాంకేతికత వివిధ రంగాల్లో పెను మార్పులకు కారణమవుతుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం దానిని రాజకీయంగా వాడుకుంటూ ప్రత్యర్ధులపై శక్తిమంతమైన ఆయుధంగా వాడుకుంటున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండియా ఏఐ సదస్సు 2026 ఢిల్లీలో జరగనున్న వేళ డిజిటల్ హక్కుల గ్రూప్ ఇంటర్నెట్ ఫౌండేషన్, ది సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ భారత్లో ఏఐ రాజకీయ, సామాజిక వినియోగంపై ఆందోళనలను లేవనెత్తుతూ ఒక నివేదికను విడుదల చేశాయి.
‘ప్రజాస్వామ్య వెనుకడుగు అంచున ఏఐ పాలన’ అనే శీర్షికతో వచ్చిన ఈ నివేదికలో జనరేటివ్ ఏఐను అధికార బీజేపీ మైనారిటీలపై దుష్ప్రచారం చేయానికి ఒక సాధనంగా ఉపయోగించందని, అలాగే ఈ సాంకేతికతను భారత్లో నియంత్రణ లేని సామూహిక నిఘా కోసం ఉపయోగిస్తున్నది స్పష్టం చేసింది. మైనారిటీలపై హింసను ప్రేరేపించడానికి, వారిని రాక్షసుల్లా అవమానవీయంగా చూపించడానికి అనుకూలమైన సాధనంగా బీజేపీకి జనరేటెడ్ ఏఐ ఉద్భవించిందని నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం.. హిందూ జాతీయవాద ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి, అసమ్మతివాదులను నోరెత్తకుండా చేయడానికి అధికార పార్టీ సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగిస్తున్నది.