Durgam Chinnaiah | కాసిపేట, డిసెంబర్ 10 : కాసిపేట మేజర్ పంచాయతీలో సర్పంచ్ గా విద్యావంతురాలైన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బానోత్ కృష్ణవేణిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మేజర్ పంచాయతీలోని దుబ్బగూడెం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బానోత్ కృష్ణవేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. కాసిపేట గ్రామ పంచాయతీలో చదువుకున్న వారు వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, కాసిపేటలో బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి అందరికీ తెలుసునని, వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రెట్టింపు సంక్షేమ పథకాలు మళ్లీ వస్తాయని, ప్రజలందరూ బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు అగ్గి సత్తయ్య, పానగంటి తిరుపతి, దుర్గం శ్రీనివాస్, బన్న శ్రీనివాస్, అక్కెపల్లి శ్రీనివాస్, సెగ్గం జమున, సత్రవేణి రేణుక తదితరులు పాల్గొన్నారు.
Fire accident | టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన 20కి పైగా దుకాణాలు
Ramavaram : ప్రతి ఒక్కరు శాంతియుతంగా ప్రచారం కొనసాగించాలి : కొత్తగూడెం టూ టౌన్ సీఐ ప్రతాప్
Akhanda 2 | అఖండ 2 దెబ్బకి ఇన్ని సినిమాలు వాయిదా పడ్డాయా.. ఏకంగా రజనీకాంత్ చిత్రం కూడా..!