KTR | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట కొనకపోవడం వల్ల గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సాయం అందించారని తెలిసిందే. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్యువాత పడిన నలుగురు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల ఆర్థికసాయాన్ని మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో కేటీఆర్ అందించారు.
కాగా మంచిర్యాల పర్యటనలో భాగంగా కేటీఆర్ లక్సెట్టిపేట మండలం రంగపేటలో బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త చిప్పకుర్తి నారాయణ ఇంట్లో భోజనం చేశారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి, దివాకర్ రావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం రంగపేటలో చిప్పకుర్తి నారాయణ అనే బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్ https://t.co/VzKJGh7Xkt pic.twitter.com/sVGx36GI8p
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026
Watch: జిప్‌లైన్ సేఫ్టీ లాక్ ఫెయిల్.. 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన టూరిస్ట్
Health News | రోజుకు 5 కప్పుల వరకు కాఫీ తాగడం సురక్షితమే.. తాజా అధ్యయనంలో వెల్లడి..!