KTR | మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్యువాత పడిన నలుగురు రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సాయాన్ని అందించారని తెలిసిందే. మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల ఆర్థికసాయాన్ని కేటీఆర్ అందజేశారు.
మంచిర్యాల పర్యటనలో భాగంగా కేటీఆర్ లక్షెట్టిపేట మండలం రంగపేట గ్రామంలో దళిత బంధు లబ్ధిదారు దాసరి రవి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన దళిత బంధుతో దాసరి రవి ఒక బొలెరో వాహనంతోపాటు కొన్ని ఆవులను కొనుగోలు చేశారు. దాసరి రవి ఇంటికి వెళ్లిన సందర్భంగా కేటీఆర్ దళిత బంధు కింద కొనుగోలు చేసిన ఆవుపాలతో చేసిన టీని అతడి తల్లితో మాట్లాడుతూ తాగారు. దళిత బంధు లబ్ధిదారుతో కేటీఆర్ మాటామంతికి సంబంధించిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Watch: జిప్‌లైన్ సేఫ్టీ లాక్ ఫెయిల్.. 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన టూరిస్ట్
Health News | రోజుకు 5 కప్పుల వరకు కాఫీ తాగడం సురక్షితమే.. తాజా అధ్యయనంలో వెల్లడి..!