Thandur | తాండూర్, డిసెంబర్ 11 : ప్రజావ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలంలోని మాధారం గ్రామానికి చెందిన సీపీఐ పార్టీ నాయకులతోపాటు బుధవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో 50 మందికిపైగా ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు దుర్గం చిన్నయ్య వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో మాదారం గ్రామపంచాయతీకి చెందిన సీపీఐ నాయకులు మలిశెట్టి సత్యనారాయణ, ఆరేపెల్లి శషికుమార్, యూత్ సభ్యులు భీముడు, చరణ్, సౌమ్య, 10 మంది యూత్ సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


e-cigarette: పార్లమెంట్లో ఈ-సిగరేట్ తాగిన టీఎంసీ ఎంపీ.. బీజేపీ ఆరోపణలు
Fire Accident | మంచిర్యాలలో ఇంటిపై అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
Panchayat Polling | ముగిసిన తొలి విడుత పోలింగ్.. కొద్దిసేపట్లో మొదలుకానున్న కౌంటింగ్..