Jeevan Reddy | మంచిర్యాల, మే 06 : మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు గోడ కూలి మృతి చెందిన రైతుల కుటుంబసభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు.
సర్కారు నిర్లక్ష్యంతో చనిపోయిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి లక్సెట్టిపేట పట్టణంలోని స్థానిక ఊట్కూరు చౌరస్తాలో ఉదయం 10 గంటలకు ధర్నాకు దిగారు. అధికారులు రావాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుల మృతికి కారకులైన అధికారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని భీష్మించుకుని కూర్చున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ రాకపోవడంతో ఆయన వచ్చే దాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని, బాధితులకు న్యాయం చేయాలని ధర్నా కొనసాగిస్తున్నారు. దాదాపు నాలుగున్నర గంటలుగా ధర్నా కొనసాగుతున్నది.
ఆర్డీవో ఓ వైపు కలెక్టర్‌తో.. మరోవైపు బాధితులతో మాట్లాడుతున్నారు.అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి భారీ ఈదురు గాలులకు కల్లాల సమీపంలో ఉన్న గోడ కూలి నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు గోడ కూలి మృతి చెందిన రైతుల కుటుంబసభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి భారీ ఈదురు గాలులకు కల్లాల సమీపంలో… https://t.co/YmSiDyfcWh pic.twitter.com/YqCpon5MCO
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2026
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నాలుగు గంటలుగా కొనసాగుతున్న జీవన్ రెడ్డి ధర్నా
జాతీయ రహదారిపై రైతులతో కలిసి బైఠాయించిన జీవన్ రెడ్డి
అకాల వర్షాల నుండి పంటను కాపాడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన బాధిత రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ https://t.co/K9IeKriOoR pic.twitter.com/R51NK30zRU
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2026