Salman Khan | సల్మాన్ ఖాన్ సరసన ఫహాద్ ఫాజిల్? ‘SVC63’ విలన్ వేటలో వంశీ పైడిపల్లి!
SVC63 | బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘SVC63’.
SVC63 | బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘SVC63’. ఈ ప్రాజెక్ట్‌లో విలన్‌కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో సల్మాన్‌ను ఢీకొట్టే పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ ప్రస్తుతం అన్వేషణలో ఉండగా.. ఇద్దరు స్టార్ నటులను ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది.
సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా, నటనతో మెప్పించే విలన్ ఉండాలని భావిస్తున్న మేకర్స్.. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ లేదా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అక్షయ్ ఖన్నాలలో ఒకరిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. వీరిద్దరిలో ఎవరిని ఫైనల్ చేసినా, తెరపై సల్మాన్‌తో పడే పోరాట సన్నివేశాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్లో కథానాయిక నయనతార కూడా పాల్గొంటుండటం విశేషం. అంతేకాకుండా, సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రను పోషించబోతున్నాడు. వంశీ పైడిపల్లి తన స్టైలిష్ మేకింగ్‌తో సల్మాన్‌ను కొత్తగా చూపించబోతున్న ఈ చిత్రాన్ని 2027 ఈద్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

