Asthma | ఆస్తమా సమస్య ఉన్నవారికి ఎంతో ఉపయోగకరం ఈ యోగాసనాలు
చాలా మందిని వేధించే ఊపిరితిత్తుల సమస్యల్లో ఆస్తమా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు చాలా మంది ఉన్నారు. అలాగే వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరిని వేధిస్తూ ఉంటుంది. ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారికి శ్వాస తీసుకోవడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది.
Asthma | చాలా మందిని వేధించే ఊపిరితిత్తుల సమస్యల్లో ఆస్తమా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు చాలా మంది ఉన్నారు. అలాగే వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరిని వేధిస్తూ ఉంటుంది. ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారికి శ్వాస తీసుకోవడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి, కాలుష్యం లేదా అలర్జీలు ఉన్నప్పుడు సమస్య మరింత పెరుగుతుంది. అయితే యోగా వంటి సహజ పద్ధతులు శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సరైన ఆసనాలను నియమితంగా చేయడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడమే కాకుండా, మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది. ప్రత్యేకంగా ఆస్తమా ఉన్నవారు తేలికైన యోగా ఆసనాలు చేస్తే శరీరానికి ఒత్తిడి లేకుండా శ్వాసను నియంత్రించుకోవడం సాధ్యమవుతుంది. ఆస్తమా ఉన్న వారు చేయదగిన సులభమైన యోగాసనాల గురించి యోగా నిపుణులు వివరిస్తున్నారు.
సుఖాసనం, భుజంగాసనం..
ఆస్తమా ఉన్న వారు చేయదగిన మొదటి ఆసనం సుఖాసనం. ఇది ఆస్తమా బాధితులకు చాలా అనుకూలమైన ఆసనం. ఈ ఆసనం ద్వారా లోతైన శ్వాస అలవాటు అవుతుంది. కాళ్లు మడిచి సూటిగా కూర్చొని, చేతులను మోకాళ్లపై ఉంచి, కళ్ళు మూసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. నాలుగు కౌంట్లలో శ్వాస తీసుకుని, ఆరు కౌంట్లలో విడిచే విధంగా సాధన చేయాలి. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరచి, ఆందోళనను తగ్గిస్తుంది. ప్రతిరోజూ 5 నుండి 10 నిమిషాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. అలాగే భుజంగాసనం ఛాతి భాగాన్ని విస్తరించడానికి సహాయపడుతుంది. పొట్టపై పడుకుని, చేతులను భుజాల క్రింద ఉంచి నెమ్మదిగా పైకి లేవాలి. ఈ సమయంలో శ్వాసను లోతుగా తీసుకోవాలి. 15 నుండి 30 సెకన్ల పాటు నిలబడి మళ్లీ సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనం శ్వాసకోశ కండరాలను బలపరచి, గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
సేతు బంధాసనం, అధో ముఖ శ్వాసాసనం..
అనంతరం సేతు బంధాసనం. ఇది కూడా ఆస్తమా బాధితులకు ఉపయోగకరంగా ఉంటుంది. వీపుపై పడుకుని, మోకాళ్లు మడిచి పాదాలను నేలపై ఉంచి, నెమ్మదిగా నడుమును పైకి లేపాలి. ఈ సమయంలో ఛాతీ విస్తరించి, శ్వాస సులభంగా జరుగుతుంది. 20 నుండి 30 సెకన్ల పాటు ఉండి మళ్లీ దిగాలి. ఇది శరీర భంగిమను మెరుగుపరచి, ఊపిరితిత్తులకు మద్దతు ఇస్తుంది. అధో ముఖ శ్వాసాసనం శరీరాన్ని ఇన్వర్టెడ్ V ఆకారంలో ఉంచే ఆసనం. చేతులు, కాళ్లపై నిలబడి నడుమును పైకి లేపాలి. ఈ ఆసనం ద్వారా ఊపిరితిత్తులలోని గాలి పూర్తిగా బయటికి వెళ్లి, తాజా ఆక్సిజన్ చేరేందుకు సహాయపడుతుంది. 30 నుండి 60 సెకన్ల పాటు శ్వాసను నియంత్రిస్తూ చేయాలి. ఇది శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది.
అర్ధ మత్స్యేంద్రాసనం, ఉత్తానాసనం..
అర్ధ మత్స్యేంద్రాసనం శరీరాన్ని మెలితిప్పే ఆసనం. కాళ్లు చాపి కూర్చొని, ఒక కాలును మరొక కాలుపై దాటి, శరీరాన్ని పక్కకు తిప్పాలి. ఈ ఆసనం ఊపిరితిత్తులలోని మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచి, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులను తగ్గిస్తుంది. చివరి ఆసనం ఉత్తానాసనం. మనసును ప్రశాంతపరచే ఆసనం. నిలబడి ముందుకు వంగి, తల, మెడను రిలాక్స్‌గా ఉంచాలి. ఈ ఆసనం ద్వారా వెన్నెముక పొడవుగా మారి, ఛాతీపై ఒత్తిడి తగ్గుతుంది. 30 నుండి 45 సెకన్ల పాటు చేయడం వల్ల శ్వాస నెమ్మదిగా, సులభంగా జరుగుతుంది. ఈ యోగా ఆసనాలను ప్రతిరోజూ అలవాటు చేసుకుంటే ఆస్తమా లక్షణాలు నియంత్రణలోకి రావడమే కాకుండా, శరీరం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే తీవ్రమైన సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతోనే యోగా ప్రారంభించడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Asthma
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

