లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి
కార్మికుల హకులను కాలరాసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూ సీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరసనల్లో భా గంగా సోమవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- కలెక్టరేట్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు
ఎదులాపురం, ఆగస్టు 10 : కార్మికుల హకులను కాలరాసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూ సీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరసనల్లో భా గంగా సోమవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విలాస్ మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులతోపాటు సీం వరర్లకు నెలకు కనీసం రూ.29 వేల వేతనం చెల్లించాలని కోరారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఐఎన్టీయూసీ ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఐఎన్టీయూసీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మునిగెల నర్సింగ్, కార్మిక సంఘాల నాయకులు సిర్ర దేవేందర్, నాయిం, అశోక్, దేవిదాస్, గాజెంగుల రాజు పాల్గొన్నారు.
నిర్మల్‌లో జైల్ భరో
నిర్మల్ అర్బన్, ఆగస్టు 10 : కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ అన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జైల్ భరో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం నుం చి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులను అణగదొక్కేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ రూ.26 వేల వేతనం ఇవ్వాలని, వీబీజీ రాం జి చట్టాన్ని రద్దు చేయాలని, నూతన విద్యుత్ విధానాన్ని తొలగించి, నూతన వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజన్న, సురేష్, గంగామణి, సుజాత, కిషన్, శైలజ, రాధ, మల్లేశ్, కదం బాయి, చంద్రకళ, కమల, లక్ష్మి, నూతన్ కుమార్, నారాయణ, రాజు, భోజన్న, తొడశం శంభు, వెంకటేశ్, దిగంబర్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
గౌడ, ఎస్సీల సాంఘిక బహిషరణ దారుణం
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

