Balka Suman | పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నమంత్రి వివేక్.. బాల్కసుమన్ నిరసన
Balka Suman | మంత్రి వివేక్ వెంకట స్వామి బైక్‌లపై పోలింగ్ బూత్‌ల వద్ద తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.
Balka suman | చెన్నూర్, ఫిబ్రవరి 11 : చెన్నూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మంత్రి వివేక్ వెంకట స్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఇందుకు నిరసనగా చెన్నూర్‌లోని అంబేద్కర్ విగ్రహం ముందు బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకట స్వామి బైక్‌లపై పోలింగ్ బూత్‌ల వద్ద తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చెన్నూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చెన్నూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ తన తన కారులో 15 లక్షల రూపాయలను, మందు కాటన్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని ఆయన ఆరోపించారు.
చెన్నూర్ మున్సిపాలిటీలో రెండవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భర్త పెద్దింటి శ్రీనివాస్ ఓటర్లకు డబ్బులు బహిరంగంగా పంచుతున్న వీడియో బయటకు వచ్చిందని, దీన్నిబట్టి చూస్తుంటే ఎన్నికలు ఎంత దుర్మార్గంగా జరుగుతున్నాయో స్పష్టమవుతున్నాయని బాల్క సుమన్ అన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు పోలింగ్ బూత్‌ల వద్ద విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Also :
కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు వేసిన కలెక్టర్
నల్లగొండలో ఓటేసిన ట్రాన్స్జెండర్లు
Chennuru | పోలింగ్ రోజూ మంత్రి వివేక్ ప్రచారం..! ఎన్నికల సంఘం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

