adivasi hakkula porata samithi | తాండూర్, జూలై 15 : ఆదివాసీల అస్థిత్వాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్న జీవో నంబర్ 49ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, కొలవార్, తోటి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్నకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల జీవితాలతో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆడుతున్న చెలగాటం మానుకోవాలి అన్నారు.
49 జీవో అమలు వల్ల ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కొల్పోతారని.. ఇది జాతి మనుగడకే దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి ఇట్టి విషయాన్ని పరిగణలోకి తీసుకోని 49 జీవోను వెంటనే రద్దు చేయాలని వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. లేని యెడల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు యాపల సమ్మయ్య, గడ్డం మణికుమార్, అవుడే మల్లేష్, అరికల శంకర్, నాయిని హన్మంతు, నాయిడి బాపు, రాజం, సురేష్ పాల్గొన్నారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి