KTR | ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు నుగూరే పాండురంగ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. పాండురంగ్ కుటుంబానికి కనీసం రుణమాఫీ కాలేదు, రైతుబంధు కూడా పడటం లేదని.. రాష్ట్రంలో ఉన్న ప్రతీ రైతు పరిస్థితి ఇదేనన్నారు.
రైతు పాండురంగ్ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి నాతోపాటు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, రాథోడ్, జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడికి పంపించారన్నారు. రైతు ఫొటో, వార్త చూసి కేసీఆర్ చలించిపోయి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలన్నారు. వాళ్లకు ఏం ధైర్యం చెప్పాలని అడిగితే రెండేళ్లు ధైర్యంగా బతకండి.. రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ వస్తడు. మళ్లా మిమ్మల్ని అందరినీ కండ్లల్ల పెట్టుకొని చూసుకుంటడని భరోసా ఇవ్వాలన్నాని చెప్పారు.
తక్షణమే రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి..
దయచేసి ధైర్యంగా ఉండండి.. ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను ఆగం చేయొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చనిపోయిన ప్రతీ రైతు కుటుంబానికి పాండురంగ్ కుటుంబంతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చదువుకునే పిల్లలుంటే వారికి ప్రత్యేకంగా ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఎందుకంటే నువ్వు ధాన్యం కొనక లంచం సిస్టమ్ పెట్టి క్వింటాల్‌కు రూ.50 అని పెట్టి లారీ ఎక్కించేందుకు లంచం, దించేందుకు లంచం.. సంచులు, సుతీలు, బార్దాన్ ఏదీ ఇయ్యవ్.. ఆఖరికి ఎండాకాలంలో మార్కెట్ యార్డ్‌లలో మంచినీళ్లు కూడా ఇయ్యవని మండిపడ్డారు.
రైతుల గోస పుచ్చుకునే ఖచ్చితంగా అవి ప్రభుత్వం చేయించిన హత్యలేనన్నారు. నువ్వు చేయించిన హత్యలే రేవంత్ రెడ్డి అందుకే ఆ కుటుంబానికి ఆదుకునే బాధ్యత, అండగా నిలవాల్సిన బాధ్యతరాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉందన్నారు.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనక పోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు నుగూరే పాండురంగ్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు https://t.co/R5n64uxR0z pic.twitter.com/jyXEqDOFr2
— Telugu Scribe (@TeluguScribe) June 20, 2026
చనిపోయిన ప్రతీ రైతుకి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలి
నువ్వు ధాన్యం కొనక, లంచం సిస్టం పెట్టి, కనీసం మార్కెట్ యార్డులో నీళ్లు కూడా లేవు.. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ హత్యలే
– కేటీఆర్ https://t.co/cvNqJZ0s0J pic.twitter.com/xc3r4m5FDj
— Telugu Scribe (@TeluguScribe) June 20, 2026
కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలాబాద్ రైతు నుగూరే పాండురంగ్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు https://t.co/rsh9gbUFjE pic.twitter.com/dzBJ4PFUgC
— Telugu Scribe (@TeluguScribe) June 20, 2026