Jogu Ramanna | ఆదిలాబాద్ : మాజీ మంత్రి జోగు రామన్న (Jogu Ramanna) ఇవాళ ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తాంతోలి గ్రామానికి వెళ్లారు. పలు కుటుంబాలను జోగు రామన్నపరామర్శించారు. ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి గాయాల పాలైన బార్కుంటి కుమార్‌తోపాటు అతని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని వారికి ధైర్యాన్ని నచ్చ జెప్పారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఓజుల లసుం బాయ్ మృతి చెందడంతో ఆమె అంతక్రియల్లో పాల్గొన్నారు. ఆమె కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జోగు రామన్న వెంట ఆప్ కం గంగయ్య, కనక రమణ, భూమన్న, నవీన్ రమణ ఉన్నారు.
Shamshabad Airport | కార్గో విమానంలో గేర్ సమస్య.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్
Patna firing | పట్నాలో కాల్పుల కలకలం.. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు.. Video