KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ పుట్టిన రోజున మిఠాయిలు పంచి పెడితే.. హెడ్మాస్టర్ను సస్పెండ్ చేస్తారా..? అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టొచ్చు. పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వొచ్చు. ఆయన కళ్యాణలక్ష్మి చెక్కులు పంచొచ్చు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయొచ్చు. ఆయనకు పాఠశాల విద్యార్థులను నడిఎండలో నిలబెట్టి పూలుచల్లి స్వాగతం పలకొచ్చు. వారితో ఆయనకు అధికార యంత్రాంగం దగ్గరుండి సెల్యూట్ కొట్టించవచ్చు. ఏ అర్హత లేకున్నా అధికారిక వేదికపై కలెక్టర్‌ను వెనక్కు నెట్టి వేదికను పంచుకోవచ్చు. పొంగులేటి పుట్టినరోజున విద్యార్థులను ఎండలో నిలబెట్టి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణికి ఎస్కార్ట్ సదుపాయం కల్పించవచ్చు.
కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, 14 ఏండ్లు అహింసాయుత పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, అస్థిత్వాన్ని చాటిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్పా..? కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు చేస్తే సరూర్ నగర్ పాఠశాల హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేస్తారా?!! వారి పుట్టిన రోజున హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు కడితే చించేస్తారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఐఏఎస్, ఐపీఎస్ లంటే గౌరవం లేదు. సహచర మంత్రుల మీద నమ్మకం లేదు. అత్యున్నత పదవిలో ఉండి ఇంత అభద్రతా భావమా..? సిగ్గు సిగ్గు అని కేటీఆర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | చరిత్ర సృష్టించి 11 ఏండ్లు అయింది.. హరీశ్‌రావు ఆసక్తికర ట్వీట్
MLC Kavitha | కేసీఆర్ హయాంలో నేరాలు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేది : ఎమ్మెల్సీ కవిత
TG Highcourt | తెలంగాణ హైకోర్టులో కేసు వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు