MLC Kavitha | సూర్యాపేట : కేసీఆర్ హయాంలో మహిళలపై నేరాలు చేయాలంటే వెన్నులో వణుకుపుట్టేది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని కవిత మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.
14 నెలల్లో 30 సార్లు ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి అని కవిత పేర్కొన్నారు. ఎవరు ఏమనుకున్నా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకుంటా అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క అంశంపై ముఖ్యమంత్రి ఆలోచన చేయకుండా పాలిస్తున్నారు. మహిళలకు ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయని కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళల అంశాలపై ముఖ్యమంత్రి కనీసం ఒక సమీక్ష చేయలేదు. మహిళలకు ప్రభుత్వం ఏమి చేయలేదు. చర్చలకు రావాలని ప్రభుత్వ పెద్దలకు సవాలు చేస్తున్నాను. కేసీఆర్ హయాంలో మహిళలకు పెద్దపీట వేశాం. మహిళా అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని కవిత గుర్తు చేశారు.
మతకల్లోలం లేని ప్రాంతం లేదు రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ పాలనలో శాంతి భద్రతల సన్నగిల్లాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఏ వర్గానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎస్సీ, బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నది. గందరగోళం.. కాకిలెక్కలతో రేవంత్ రెడ్డి కాలం వెల్లదీస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ గల్లా పట్టుకొని అడిగితే రైతు రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎవరికీ సంపూర్ణంగా రుణ మాఫీ కాలేదు. రైతుభరోసా ఒక్కో గ్రామంలో సగం మంది రైతులకు కూడా రాలేదు అని కవిత తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Peddagattu Jathara | చౌడమ్మ తల్లికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
TG Highcourt | తెలంగాణ హైకోర్టులో కేసు వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు