Farmers | బేల, జూన్ 12: రైతులు వ్యవసాయంలో సేంద్రియ సేంద్రియ పద్ధతులనే పాటించాలని శాస్త్రవేత్త డాక్టర్ డి. కుమార స్వామి అన్నారు. ఈ సందర్భంగా గురువారం బేల మండలంలోని సంగ్వి గ్రామంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమంలో భాగంగా వికసిత కృషి సంకల్ప్ అభియాన్” కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వ్యవసాయంలో అవసరం మేరకు రసాయన మందులను వినియోగించడం, పురుగు మందులు పిచికారిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సమగ్ర సస్య రక్షణ చర్యల గురించి , వ్యవసాయంలో తక్కువ యూరియా వాడకం, ఎరువులు పురుగు మందులు. గడ్డి మందుల రసీదులను భద్రపరచడం, సాగునీటి ఆదా చేయడం, పంట మార్పిడి పద్ధతి పాటించడం, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడడం వంటి ఆరు అంశాల గురించి వివరించారు.
భారత ప్రభుత్వ వ్యవసాయ. రైతు సంక్షేమ శాఖ సహకారంతో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) మే 29 నుండి జూన్ 12, 2025 వరకు దేశవ్యాప్తంగా ‘వికసిత కృషి సంకల్ప్ అభియాన్” అనే పేరుతో చేపడుతున్న భారీ ప్రీ-ఖరీఫ్ ప్రచారాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తేనెటీగల పెంపకం, సోలార్ పానెల్ వారి క్షేత్రాలలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందడం, అటవీ చెట్ల పెంపకం, చిరు ధాన్యాల పెంపకం, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 1.5 కోట్ల మంది రైతులతో ప్రత్యక్ష సంభాషణలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ కళాశాల, అదిలాబాద్ పాల్గొని వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా చేపడుతున్న విస్తరణ కార్యక్రమాలను ఇతర మాద్యమలైనటువంటి టీవీ, వార్తా పత్రికలు, రేడియొ, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నూతన సమాచారాన్ని ఎలా తెలుసుకోవాలి అని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ రెడ్డి, డాక్టర్ జి. అనిత, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్