Jayakrishna Ghattamaneni | వాలంటైన్స్ డే సందర్భంగా తెలుగు సినీ ప్రియులకు ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది.
విడుదలైన పోస్టర్లో “ఏ భాషలో చెప్పాలి నా ప్రేమని, వెయ్యేళ్ళ నా ఈ ఎడబాటుని” అంటూ కథానాయకుడు శ్రీను మంగతో చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని (Rasha Thadani) ఈ చిత్రంతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఇక ఈ సినిమాకు ఆర్ ఎక్స్ 100, మంగళవారం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా మరియు ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Srinivasa Mangapuram First Look