Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ వండర్‌గా, హైఎండ్ గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. అందుకే ఈ సినిమాకు సంబంధించిన చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా విడుదల తర్వాత ఇండియన్ సినిమా మేకింగ్ స్టైల్లో కొత్త ట్రెండ్ సెట్ అవుతుందని భావిస్తున్నారు.
లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్‌కు ఈ సినిమా ఫౌండేషన్‌గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై మరో టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే… సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే నెమ్మదిగా సాగుతుండటంతో అల్లు అర్జున్ అసంతృప్తిగా ఉన్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్లాన్ చేసిన రిలీజ్ డేట్‌కు సినిమా పూర్తి అవుతుందా లేదా అన్న ఆందోళన కూడా బన్నీకి ఉన్నట్లు టాక్. ఈ నేపథ్యంలో మేకర్స్‌తో మాట్లాడి, మేకింగ్‌ను మరింత పక్కాగా ప్లాన్ చేసి షూటింగ్ వేగవంతం చేయాలని సూచించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూడా సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో ఫ్యాన్స్‌లో మరింత ఎగ్జైట్మెంట్ పెరిగింది. ఆ సినిమా కూడా భారీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే, అట్లీ – అల్లు అర్జున్ కాంబినేషన్ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయ్యే సరికి అల్లు అర్జున్ రేంజ్ గ్లోబల్ లెవల్‌కు వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రం ఈ భారీ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.