Kunamneni Sambashiva Rao | కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ వచ్చిన నేపథ్యంలో పాలకవర్గం ఏర్పాటులో సీపీఐకి మద్దతిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రతిపాదనపై సీఐపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సానుకూలంగా స్పందించారు. కేటీఆర్ ప్రతిపాదన మేరకు కొత్తగూడం మేయర్ పదవి కైవసంచేసుకుంటామని ప్రకటించారు.
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, ఇతరులు 6, బీజేపీ 1, సీపీఎం 1 సీట్లు రావడంతో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీపీఐ ఒప్పుకుంటే తమ మద్దతుతో మేయర్ పదవి ఇస్తామని కేటీఆర్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీని నిరోధించాల్సిన అవసరం ఉన్నదని.. ఇందుకోసం కలిసిరావాలని కోరారు. ఈ నేపథ్యంలోనే సీపీఐ కొత్తగూడెం కార్పొరేషన్‌ను తీసుకోదలిస్తే మేము మద్దతిస్తం’ అని కేటీఆర్ ప్రకటించారు. దీనిపై కూనంనేనితో కేటీఆర్ ఫోన్ చేసి చర్చించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ప్రతిపాదన మేరకు బీఆర్ఎస్ పార్టీతో కలిసి మేయర్ పదవి దక్కించుకుంటామని సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.