ఎస్సారెస్పీకి తగ్గిన వరద
ఎస్సారెస్పీకి ఎగువప్రాంతం నుంచి వరద తగ్గిపోయింది. ఆదివారం ఉదయం 6గంటలకు 17,127 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా క్రమంగా తగ్గుతూ సాయంత్రం 6గంటల వరకు 3,217 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వచ్చింది. ప్రాజెక్ట్ నుంచి 993 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా, కాకతీయ కాలువకు 300, మిషన్‌భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నిజాంసాగర్/నాగిరెడ్డిపేట/మోర్తాడ్, ఆగస్టు 9: ఎస్సారెస్పీకి ఎగువప్రాంతం నుంచి వరద తగ్గిపోయింది. ఆదివారం ఉదయం 6గంటలకు 17,127 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా క్రమంగా తగ్గుతూ సాయంత్రం 6గంటల వరకు 3,217 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వచ్చింది. ప్రాజెక్ట్ నుంచి 993 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా, కాకతీయ కాలువకు 300, మిషన్‌భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 462 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో1078.80అడుగుల(41.907టీఎంసీలు)నీటినిల్వ ఉన్నది. ప్రాజెక్ట్‌లోకి జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 30.445 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా, 5.091టీఎంసీల అవుట్‌ఫ్లో కొనసాగింది.
నిజాంసాగర్‌కు 6,367 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఆదివారం సాయంత్రానికి నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 1400.45 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి 6,367 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగుల (17.80 టీఎంసీలు)కు గాను 1400.45 అడుగుల (11.83 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
పోచారం ప్రాజెక్టులోకి తగ్గిన ఇన్ ఫ్లో…
పోచారం ప్రాజెక్టులోకి ఆదివారం ఇన్‌ఫ్లో తగ్గిందని డీఈఈ కిష్టయ్య తెలిపారు. ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రానికి 1,413 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని పేర్కొన్నారు. 50 క్యూసెక్కుల నీరు ప్రధాన కాలువ ద్వారా దిగువకు విడుదల చేయగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1.820 టీఎంసీల నీరు ఉన్నదని తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

