ఈ చలికాలంలో చర్మం పొడిబారుతుందా? ఈ చిట్కాలు పాటించండి
skin care in winter season | వణుకు పుట్టించే చలి.. చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే క్రీములన్నీ గంపగుత్తగా పూసుకుంటారు. ఇలా చేస్తే, కొత్తకొత్త సమస్యలుకోరితెచ్చుకున్నట్లు అవుతుంది. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చలిపులి బారినుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

మరీ వేడినీళ్లు వద్దు
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం వేడివేడి నీళ్లతో స్నానం చేస్తారు. ఆ సమయానికి హాయిగా ఉంటుంది కానీ, ఈ అలవాటు చర్మ ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. చలి వాతావరణం చర్మంలోని సహజమైన నూనెలను తగ్గిస్తుంది. దీనికి తోడు వేడినీళ్ల స్నానం వల్ల చర్మంపై పగుళ్లు ఏర్పడి రక్తస్రావ సమస్యలు వస్తాయి. ఎంత చల్లటి వాతావరణమైనా, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడమే ఉత్తమం. రసాయనాల జాడలేని సేంద్రియ సబ్బులు వాడటం మరీ మంచిది.
సురక్షితంగా దాచుకోవాలి
చలి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు స్వెటర్ మాత్రమే సరిపోదు. కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌజులు ధరించాలి. బయటికి వెళ్లినప్పుడు ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
మాయిశ్చరైజర్ తప్పనిసరి
ఈకాలంలో చర్మం త్వరగా పొడిబారుతుంది. స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. విటమిన్-ఇ, చియా గింజలు, ఫ్యాటీ ఆమ్లాలు, లావెండర్ నూనెలు ఉన్న మాయిశ్చరైజర్‌నే ఎంచుకోవాలి. వాటర్ బేస్డ్ బదులు ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లను కొనాలి.
సన్‌స్క్రీన్ అవసరమే
ఎండాకాలంలోనే సన్‌స్క్రీన్ అవసరమని అనుకుంటే పొరపాటు. చలికాలంలోనూ సూర్యరశ్మి చర్మానికి హాని చేస్తుంది. రుతువులతో సంబంధం లేకుండా, బయటికి వెళ్లినప్పుడు చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం ఉత్తమం.
నీళ్లు మానొద్దు
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దాహం వేయదు. నీళ్లు తగ్గించి కాఫీ, టీలు ఎక్కువగా తీసుకుంటారు. దాంతో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. చర్మం పాలిపోతుంది, పొడిబారుతుంది, పగుళ్లు వస్తాయి. దాహం వేసినా వేయకపోయినా రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాల్సిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Weight Loss | చలికాలంలో బరువు పెరిగిపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి
Winter Food | చలికాలంలో ఈ ఫుడ్ తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా
Milk | ఏ పాలు తాగితే మంచిది? ఆవుపాలా? బర్రెపాలా?
Health tips : ఈ పప్పులతో అనారోగ్య ముప్పునకు చెక్!
Health tips | మీ వంటగదిలో ఉన్న ఈ వస్తువులతో వచ్చే లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే
allam murabba | ఖాళీ కడుపుతో దీన్ని తింటే ఏమవుతుంది?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

