Health tips | మీ వంటగదిలో ఉన్న ఈ వస్తువులతో వచ్చే లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే
Health tips | భారతీయుల వంటగది సహజ సిద్ధమైన పోషకాల గని. వంటల్లో వాడే అనేక దినుసులలో అపారమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాంటి సుగుణాల వివరాలు తెలుసుకుందాం..

పొద్దుతిరుగుడు గింజలు
వీటిలో విటమిన్- ఇ అపారం. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కాలానుగుణంగా వచ్చే వ్యాధుల ముప్పు తప్పుతుంది. ఇవి వాల్నట్స్ కంటే రెండు రెట్లు ఎక్కువ ప్రొటీన్లను ఇస్తాయి. అంతేకాకుండా పల్లీలతో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువ విటమిన్- ఇ ఉంటుంది. రోజూ ఒక టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అతిగా తింటే మాత్రం వికారం, దద్దుర్లు, బరువు పెరుగదల ముప్పు పొంచి ఉంటుంది.

బ్రకోలి
పోషకాలతో సమృద్ధమైన ఆకుకూర బ్రకోలి. గర్భిణులకు ఇది ఫోలిక్ ఆమ్లానికి గని లాంటిది. పైగా విటమిన్- సి, ఎ, ఇ లాంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ నుంచి విముక్తి పొందడానికి ఇవి దోహదపడతాయి. అయితే కడుపు ఉబ్బరం లేదా పేగుల్లో మంటగా అనిపిస్తే మాత్రం బ్రకోలీని మితంగా తీసుకోవాలి.

మిరియాలు
సుగంధ ద్రవ్యాల రాణిగా ప్రసిద్ధి చెందిన మిరియాలు యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఎ, సి విటమిన్లతో సమృద్ధమై ఉంటాయి. ఇందులో ఉండే పైపెరైన్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటంలో దోహదపడుతుంది. అరుగుదలను మెరుగుపరుస్తుంది. మేలుచేసే ఆహార పదార్థాలను శరీరం గ్రహించడంలో దోహదపడుతుంది.

కొత్తిమీర
గొప్ప వనమూలిక. ఫైబర్, విటమిన్ కె, ఎ, క్యాల్షియంతో సమృద్ధమైంది. అరుగుదలలో సాయకారి. రక్తంలో చక్కెర స్థాయులను తగ్గిస్తుంది. హానికర లోహాల నుంచి శరీరానికి స్వస్థత చేకూరుస్తుంది. ఒత్తిడితో పోరాడుతుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. మహిళల రుతుచక్రం సవ్యంగా సాగేలా దోహదపడుతుంది.

కుంకుమ పువ్వు
దానికే ప్రత్యేకమైన రంగుతో, గొప్ప సువాసనతో అలరారే సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. మెరిసే చర్మం కోసం, క్యాన్సర్‌పై పోరాటం కోసం, బరువును, కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి, నిద్రలేమి, కుంగుబాటు నివారణకు, గుండె వ్యాధుల నియంత్రణకు, ఆహారం అరుగుదలకు కుంకుమపువ్వు చేసే మేలు అంతాయింతా కాదు.

పుదీనా
ఏడాదంతా సర్వసాధారణంగా ఉపయోగించే ఔషధ మొక్క పుదీనా. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దగ్గును నివారిస్తుంది.

తులసి
భారతీయ సంప్రదాయంలో పూజనీయమైన స్థానం తులసిది. అంతేకాదు వంటిల్లునూ ఆరోగ్యవంతం చేస్తున్నది. తులసి శరీర రోగ నిరోధక వ్యవస్థకు మంచిది. వాతం, క్యాన్సర్, ఒత్తిడితో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లకు నిలయం. గుండె కవాటాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నివారిస్తుంది.

అశ్వగంధ
ఒత్తిడికి కారణం శరీరంలో ఉండే కార్టిసోల్ అనే హార్మోన్. రక్తంలో కార్టిసోల్ స్థాయులను తగ్గించడం ద్వారా అశ్వగంధ ఒత్తిడిని తట్టుకునేలా చేస్తుంది.

కరివేపాకు
విటమిన్ ఎ, బి, సి, ఇలతో సమృద్ధం. పిండిపదార్థాలు, భాస్వరం (ఫాస్పరస్) కూడా ఉంటాయి. ఇందులో ఉన్న ఫోలిక్ ఆమ్లం రక్తహీనతతో (ఎనీమిక్) బాధపడే రోగులకు మంచిది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
Health tips : ఈ సూపర్‌ఫుడ్‌తో సూక్ష్మ పోషకాలు సొంతం!
కొవాగ్జిన్ రెండు డోసులు వేసుకున్నాక.. బూస్టర్ డోస్ కోవిషీల్డ్ వేసుకుంటే ఏమవుతుంది?
children crying | పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

