omicron booster dose | ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విజృంభిస్తున్నది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులను చూసి ప్రజలు వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రాణాలు నిలుపుకోవాలంటే బూస్టర్ డోస్ వేసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్‌పై పనిచేస్తాయా లేదా అని ఒకవైపు సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో.. బూస్టర్ డోస్ వేసుకోవడం మంచిదని పలువురు వైద్య నిపుణులు చెబుతుండటంతో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. అసలు ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా? లేదా? ఒకవేళ బూస్టర్ డోస్ వేసుకోవాలని అనుకుంటే ఏది వేసుకోవాలి? కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నాక.. మూడో డోస్‌గా అదే వ్యాక్సిన్ తీసుకోవాలా? కొవాగ్జిన్ కూడా తీసుకోవచ్చా? అనే సందేహాలు వస్తున్నాయి. వీటన్నింటికీ ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఇచ్చిన వివరణ ఒకసారి చూద్దాం..
‘ ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు ఒమిక్రాన్‌పై కూడా పనిచేస్తున్నాయని నిర్ధారించారు. కాబట్టి టీకాల పనితీరుపై సందేహాలు పక్కనపెట్టి, వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ టీకాలు ఒమిక్రాన్‌పై కనీసం 50 శాతం మేర సమర్థంగా పనిచేస్తాయి. దీనివల్ల జబ్బు తీవ్రరూపం దాల్చకుండా ఉంటుంది. రెండు డోసులూ పూర్తయిన వారికి బూస్టర్ డోస్ తప్పనిసరి. బూస్టర్ విషయమై ఇప్పటికే మేం ప్రభుత్వానికి స్పష్టమైన సూచన చేశాం. కరోనా సోకిన వారిలోగాని, వ్యాక్సిన్ తీసుకున్న వారిలోగాని ఆరు నెలల తరువాత పరీక్షలు జరిపితే.. యాంటీబాడీస్ గణనీయంగా తగ్గిపోతున్నట్లు కనిపిస్తున్నది. యాంటీబాడీస్ తగ్గిపోతే మళ్లీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమస్యను అధిగమించాలంటే రెండు డోసులు పూర్తయిన ఆరు నెలల తరువాత, బూస్టర్ డోసు తీసుకోవాలి. బూస్టర్‌లో క్రాస్ వ్యాక్సిన్ మంచిది. అంటే మొదటి రెండు డోసులు ఒకే రకమైన వ్యాక్సిన్ తీసుకున్న వారు, బూస్టర్ డోస్‌లో వేరే రకమైన వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో రెండు వేరువేరు యాంటీబాడీస్ ఉత్పన్నం అవుతాయి. ఒకే రకమైన వ్యాక్సిన్ తీసుకుంటే 900 యాంటీబాడీస్ వస్తున్నాయి. క్రాస్ వ్యాక్సిన్ అయితే 1800 యాంటీబాడీస్ వస్తున్నాయి. బూస్టర్‌కు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలుపలేదు. కాకపోతే, ఒమిక్రాన్ తరువాత, ప్రభుత్వం కొంత సానుకూలంగానే ఉన్నది. ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.’ అని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Omicron variant | అసలు ఒమిక్రాన్ వేరియంట్ ఎలా పుట్టుకొచ్చింది?
Omicron | దేశంలో మరో ఎనిమిది మందికి ఒమిక్రాన్ పాజిటివ్.. 49కి పెరిగిన కేసులు
Omicron fears | కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
పంటినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. ఒమిక్రాన్ బయటపడింది
Omicron | ఒమిక్రాన్ చాలా ప్రమాదకారి.. కానీ డేటా లేదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ