Omicron variant | అసలు ఒమిక్రాన్ వేరియంట్ ఎలా పుట్టుకొచ్చింది?

Omicron variant | ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ భయపెట్టిస్తున్నది. రోజురోజుకీ కొత్త కేసుల సంఖ్య పెరిగిపోతున్నది.ఇప్పటికే భారత్‌లో 49 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అసలు దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ ఎలా పుట్టుకొచ్చింది? కరోనా వైరస్ ఒమిక్రాన్‌గా ఎలా రూపాంతరం చెందింది? అన్న ప్రశ్నలకు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి విశ్లేషణ ఒకసారి చూద్దాం..
ఒమిక్రాన్ వైరస్‌ను తొలిసారిగా నవంబర్ 9న బోట్స్వానాలో, నవంబర్ 11న దక్షిణాఫ్రికాలో గుర్తించారు. తరువాత ఆ వైరస్ ప్రపంచంలో పలు దేశాలకు వ్యాపించింది. ఇలా జరగడానికి ఓ కారణం ఉంది. దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ రోగుల సంఖ్య అధికం. అంతే కాకుండా, అక్కడ 20 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. దీనివల్ల వైరస్ ఎక్కువ మందికి వ్యాపించింది. ఈ క్రమంలో అక్కడున్న ఒక హెచ్ఐవీ రోగిలో ఈ వైరస్ ఎక్కువ కాలం ఉండిపోయింది. సాధారణంగా కరోనా వైరస్ మనిషిలో రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఉండదు. రెండు వారాల్లో మనిషి అయినా చనిపోతాడు, వైరస్ అయినా చస్తుంది. కానీ అక్కడ ఒక హెచ్ఐవీ రోగిలో రెండు మూడు నెలలపాటు తిష్ఠవేసింది. ఈ వ్యవధిలో వైరస్‌లో డూప్లికేషన్ జరిగి పలు మార్పులు చోటుచేసుకున్నాయి. మూడు నెలల తరువాత వైరస్ బయటపడి ఇలా తీవ్రంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Omicron | దేశంలో మరో ఎనిమిది మందికి ఒమిక్రాన్ పాజిటివ్.. 49కి పెరిగిన కేసులు
Omicron fears | కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
పంటినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. ఒమిక్రాన్ బయటపడింది
Omicron | ఒమిక్రాన్ చాలా ప్రమాదకారి.. కానీ డేటా లేదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

