ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ చాలా ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా దీనికి చాలా హై రిస్క్ ఉందని ఈ సంస్థ అభిప్రాయపడింది. ఇది వ్యాక్సిన్ రక్షణ నుంచి తప్పించుకుంటుందనడానికి కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయని, కాబట్టి దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పింది.
అయితే ఈ వేరియంట్ తీవ్రతను అంచనా వేయడానికి సరిపోయే డేటా లేదని పేర్కొంది. ప్రాధమిక పరిశోధన ప్రకారం, ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉంచే ఇమ్యూనిటీ వ్యవస్థ నుంచి ఈ వేరియంట్ తప్పించుకుంటోందని, అదే సమయంలో చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు కనబడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భవిష్యత్తులో ఇది మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.