పంటినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. ఒమిక్రాన్ బయటపడింది

Toothache leads to omicron detection | దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. విదేశాల నుంచి వచ్చేవారిపై ఎంత నిఘా పెట్టినప్పటికీ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎయిర్‌పోర్టులో కరోనా టెస్టులు చేసినప్పుడు నెగెటివ్ వచ్చి.. ఆ తర్వాత కూడా లక్షణాలు బయటపడకుండా ఈ వేరియంట్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వేరే ఏదో సమస్యతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు అసలు విషయం బయటపడుతుంది. తాజాగా మహారాష్ట్రలో ఇలానే ఒమిక్రాన్ కేసు బయటపడింది. 12 ఏండ్ల బాలిక పంటి నొప్పి ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి వెళ్తే ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. ఆమెతో పాటు ఐదుగురు కుటుంబసభ్యులకు కూడా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
వివరాల్లోకి వెళ్తే.. 12 ఏండ్ల బాలిక తన కుటుంబసభ్యులతో కలిసి నైజీరియా నుంచి మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ జిల్లాకు నవంబర్ 24న తిరిగొచ్చింది. విదేశాల నుంచి వచ్చిన సమయంలో వారికి ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. దీంతో నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఇటీవల బాలికకు పంటినొప్పి వచ్చింది. దీంతో చికిత్స కోసం స్థానిక డెంటల్ హాస్పిటల్‌కు వెళ్లింది. కానీ అక్కడి డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరించాడు. మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో కచ్చితంగా ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆ బాలిక.. కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. విదేశాల నుంచి రావడం వల్ల జన్యు పరీక్షలు చేయగా ఒమిక్రాన్ కూడా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా ఒమిక్రాన్ నిర్ధరణ కావడం గమనార్హం. దీంతో వారందరినీ జిజామాత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అధికారులు వారితో సన్నిహితంగా ఉన్నవారిని వెతికే పనిలో పడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Omicron | ఒమిక్రాన్ వేరియంట్‌కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?
First Omicron death: యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం.. ధృవీకరించిన బ్రిటన్ ప్రధాని
Omicron | ఒమిక్రాన్‌తో టీకా వీక్.. డెల్టా కంటే వేగంగా వ్యాప్తి
ఏప్రిల్ నాటికి బ్రిటన్‌లో 75వేల ఒమిక్రాన్ మరణాలు!
ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. బాధితుడి గ్రామంలో కరోనా పరీక్షలు..
Omicron | ఒమిక్రాన్ బాధితులలో ఎక్కువ శాతం వ్యాక్సిన్ తీసుకున్నవారే : అమెరికా
Omicron variant | గుడ్‌న్యూస్.. ఈ ఒక్క ట్రీట్మెంట్తో ఒమిక్రాన్ ఖతం!!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

