Omicron | ఒమిక్రాన్ బాధితులలో ఎక్కువ శాతం వ్యాక్సిన్ తీసుకున్నవారే : అమెరికా
Omicron | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికాలో దడ పుట్టిస్తోంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 43 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ 43 మందిలో రెండు డోసుల తీసుకున్న వారే ఎక్కువ

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికాలో దడ పుట్టిస్తోంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 43 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ 43 మందిలో రెండు డోసుల తీసుకున్న వారే ఎక్కువ.
అమెరికా సిడిసి (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తాజా నివేదిక ప్రకారం దేశంలో ఇప్పటివరకు 43 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. వీటిలో 34 మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారున్నారు. వీరిలో 14 మంది బూస్టర్ డోసు(మూడో డోసు) కూడా తీసుకున్నవారు ఉండడం గమనార్హం.
అమెరికాలోని మొత్తం 22 రాష్ట్రాలలో ఈ కేసు నమోదయ్యాయి. సంఖ్యాపరంగా ఈ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ.. సిడిసి నివేదికతో గణాంకాలను చూస్తే.. అసలు ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయా? వ్యాక్సిన్ల ప్రభావం ఒమిక్రాన్‌పై ఉంటుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఈ 43 కేసులలో 25 మంది 18 నుంచి 39 వయసు కలవారున్నారు. కేవలం ఆరుగురు మాత్రమే ఇంతకుముందు కరోనా సోకిన వారున్నారు. అగ్రరాజ్యంలో ఒమిక్రాన్ మొట్టమొదటి కేసు డిసెంబరు 1న నమోదు అయింది. అది కూడా పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్న వ్యక్తికే కావడం గమనార్హం. అతను నవంబర్ 15న దక్షిణాఫ్రికా నుంచి అమెరికా వచ్చాడని సిడిసి అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

