ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. బాధితుడి గ్రామంలో కరోనా పరీక్షలు..

అమరావతి: విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది పలు చర్యలు తీసుకుంటుంది. ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 34 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి గత నెల 27న ముంబై మీదుగా విశాఖపట్నం వచ్చాడు. ముంబైలో అతనికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా కొవిడ్ నెగెటివ్‌గా వచ్చింది. విశాఖపట్నం చేరుకున్న తర్వాత అధికారులు మరోసారి కరోనా పరీక్ష చేశారు. అందులో పాజిటివ్‌గా వచ్చింది.
ఈ నేపథ్యంలో అతని నమూనాలను అధికారులు హైదరాబాద్‌లోని సీసీఎంబీకి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. తాజాగా అందులో ఒమిక్రాన్‌గా తేలిందని డీఎంహెచ్‌వో రమణకుమారి తెలిపారు. ఒమిక్రాన్ బాదితుడిని కలిసిన 40మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్ వచ్చిందని వివరించారు. బాధితుడు స్వగ్రామంలో పరిసర ప్రాంతాల్లో నివాసమున్న వందమందికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- DMHO
- omicron
- Positive
- Vijayanagaram
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

