సీఎం క్షమాపణ చెప్పాలి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్‌రు. మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో ఆదివారం ఆయన మాట్లాడుతూ... సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక క్షుద్రపూజలు, మంత్రాలు తంత్రాలు అంటూ చేతకాని మాటలు మాట్లడడం తగదన్నారు.
- బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి
మనోహరాబాద్, ఆగస్టు 16: మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్‌రు. మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో ఆదివారం ఆయన మాట్లాడుతూ… సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక క్షుద్రపూజలు, మంత్రాలు తంత్రాలు అంటూ చేతకాని మాటలు మాట్లడడం తగదన్నారు.
సమాజంలో మంత్రాలు, తంత్రాలు లేవని, అవన్నీ మూఢ నమ్మకాలని ఊరూరా పోలీసులు దండోరా వేసి చైతన్యపరుస్తుంటే, సీఎం మూఢనమ్మకాలు ఉన్నాయని అనడంతో ప్రజలతో పాటు మేధావులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హామీల గురించి ప్రశ్నిస్తే, డైవర్షన్ రాజకీయాలు సీఎం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జరిగితే, రేవంత్ పాలనలో ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇమాంపూర్ చంద్రశేఖర్‌గౌడ్, సర్పంచ్‌లు సాయికుమార్, మోతీబాయ్లక్ష్మణ్సింగ్, మాజీ సర్పంచ్‌లు పూల అర్జున్, విఠల్, నాయకులు వెంకట్‌గౌడ్, బిక్షపతి, నరేశ్, ఉదయ్రంజన్గౌడ్, స్వామి, రమేశ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

