ఘనంగా గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలు
ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించారు. పలు మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. యాదగిరిగుట్టలోని గొంగిడి నిలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మైలారిగూడెం సర్పంచ్ మారెడ్డి కొండల్‌రెడ్డి, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు.
- యాదగిరి గుట్టలో 2 వేల మందితో ర్యాలీ
యాదగిరిగుట్ట, ఆగస్టు 16 : ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించారు. పలు మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. యాదగిరిగుట్టలోని గొంగిడి నిలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మైలారిగూడెం సర్పంచ్ మారెడ్డి కొండల్‌రెడ్డి, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు.
కేక్ కట్ చేసి మాజీ ప్రభుత్వ విప్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా గొంగిడి దంపతులు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండకింద వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి పంపిణి చేశారు. అనంతరం గొంగిడి యూత్ ఐకాన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో సుమారు 2 వేల మంది యువకులు, విద్యార్థులు, సో షల్ మీడియా నాయకులు పాల్గొన్నారు. డోలు చప్పుళ్లు, బోనాలతో మహిళలు ఆడుతూ పాడుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వంగపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గం నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ మాజీ విప్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

శుభకాంక్షలు తెలిపిన ప్రముఖలు..
ఫోన్ ద్వారా మాజీ సీఎంకేసీఆర్ ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ ద్వారా జన్మదిన శుభకాంక్షలు చెప్పారు. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, బీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి క్యామ మల్లేశ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆమెకు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

