న్యూఢిల్లీ : రోజుకో ఎగ్ తీసుకోవడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించగా పోషకాహార నిపుణులు గుడ్డు తినడం ఆరోగ్యానికి వెరీ గుడ్ అని తేల్చేశారు. ఎగ్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, థియామైన్, బీ12 వంటి కీలక పోషకాలు దాగున్నాయి.
ఇవి పిల్లల పెరుగుదలకు కీలకం కాగా, ఇందులో ఉండే కొవ్వు, ప్రొటీన్ పిల్లల బ్రెయిన్ పెరుగుదలపైనా సానుకూలంగా ప్రభావం చూపుతాయని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ వైశాలి వర్మ చెప్పుకొచ్చారు. మన ఆహారంలో ఎగ్స్ పోషకాలతో కూడినవే కాకుండా అందుబాటు ధరలో కూడా లభిస్తాయి. ఎగ్లో ఉండే బీ12 విటమిన్ కారణంగా బీ12 లోపం ఉన్నవారు శాకాహారులు నిరభ్యంతరంగా ఎగ్‌ను తీసుకొవచ్చు.
ఎర్రరక్త కణాల పెరుగుదలకు దోహదపడి రక్తహీనతను నివారించడంలో ఎగ్ మేలైన ఆహారమని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అయితే నాన్ వెజ్ తీసుకునేవారు ఎగ్స్‌ను రోజూ తగిన మోతాదులోనే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎగ్, చికెన్, చేపల్లో రోజుకొకటి చొప్పున తీసుకుంటే మేలని చెబుతున్నారు.