allam murabba | ఖాళీ కడుపుతో దీన్ని తింటే ఏమవుతుంది?
allam murabba | ‘అల్లం మురబ్బా.. అల్లం మురబ్బా..’ అన్న మాట తెలంగాణలో పల్లె నుంచి పట్నం వరకూ వినిపించే తొలిపొద్దు పాట! ఈ ఘాటైన స్వీటు.. ఆరోగ్య విలువల్లోనూ మేటి. అప్పట్లో ప్రతి ఇంట్లో ఓ అల్లం మురబ్బా డబ్బా ఉండేది. కడుపులో గడబిడ అయిన ప్రతిసారీ ఆ మూత తెరుచుకునేది.

అల్లం మురబ్బా తీరే వేరు. ఘాటైన అల్లం, తియ్యని బెల్లం కలగలిసిన రుచి ఎంతో ప్రత్యేకం. కష్టంగా మొదలుపెట్టినా ఇష్టంగా అలవాటు పడిపోతారు చాలామంది. కొంత ఘాటుగా అనిపించినా, అందులోని ఔషధ గుణాల కారణంగా భరించి తీరాల్సిందే.

అల్లం మురబ్బా ‘జింజర్ క్యాండీ’ రూపంలో ఆధునిక సొబగులద్దుకొంది. ఆన్లైన్లోనూ అందుబాటులోకి వచ్చింది. అల్లం మురబ్బా అమ్మకం ఎంతోమందికి జీవనోపాధి కూడా. ఇప్పటికీ హైదరాబాద్ బస్తీల్లో ‘అల్లం మురబ్బా’ అక్బర్ బాషాలు కనిపిస్తూనే ఉంటారు. మురబ్బాలోని ఔషధ గుణాల్ని కథలుకథలుగా చెబుతూ ఉంటారు.

అరకప్పు అల్లం తురుము, రెండు కప్పుల బెల్లం, చిటికెడు ఉప్పు ఉంటే చాలు. అరగంటలో అల్లం మురబ్బా తయారైపోతుంది. కావాలనుకుంటే కాస్త నెయ్యి కూడా జతచేసుకోవచ్చు. పరగడపున ఒక
చిన్న ముక్క తింటే, ఎటువంటి జీర్ణ సమస్యలున్నా ఇట్టే, మాయమైపోతాయని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి.

బెల్లం వాడటం వల్ల మధుమేహంతో బాధపడేవారు సైతం నిరభ్యంతరంగా తినవచ్చు. అల్లంలోని వైద్య గుణాలు దీర్ఘకాలిక అజీర్ణం, కడుపులో నొప్పి, పొట్టలో అసౌకర్యం తదితర సమస్యలను
పరిష్కరిస్తాయి. ఖాళీ కడుపుతో తింటే అల్లం మురబ్బా ప్రభావం నాలుగు రెట్లు అధికం అవుతుందని నిపుణుల మాట.

బెల్లం పాకంలో అల్లాన్ని బాగా ఉడికించడం వల్ల అల్లం ఘాటు, బెల్లం తీపి కలగలసి
ఒక కొత్త రుచిని సృష్టిస్తాయి. వీటిని నిక్షేపంగా రెండు నెలలు నిల్వ చేసుకోవచ్చు. బిళ్లలు,
గోళీల రూపంలోనే కాకుండా పొడిగానూ వాడుకోవచ్చు. ఉదయాన్నే పాలలో కానీ, నీళ్లలో కానీ
అరస్పూన్ మురబ్బా పొడి కలుపుకొని తాగితే ఎలాంటి జీర్ణ సమస్యలూ దరిచేరవని అంటారు.
గర్భిణులలో వాంతులు, వికారం వంటి సమస్యలను తగ్గించడానికి ఔషధంలా పనిచేస్తుంది అల్లం మురబ్బా. పిల్లల్లో పైత్యం, కఫం వంటి రుగ్మతలను నివారించడంలోనూ సాయపడుతుంది. బెల్లంలోని ఐరన్ రక్తాన్ని శుద్ధిచేసి జీవ క్రియను క్రమబద్ధీకరిస్తుంది. మహిళల్లో తలెత్తే గర్భాశయ సమస్యల నివారణకు కూడా సహకరిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
sunnundalu | షుగర్ ఉన్నవాళ్లు సున్నుండలు తినొచ్చా?
Popcorn | పాప్కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Health
- health tips
- sweets
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు,తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

