sunnundalu | షుగర్ ఉన్నవాళ్లు సున్నుండలు తినొచ్చా?

sunnundalu health benefits | సున్నుండలు, మినపుండలు, నేతిముద్దలు.. ఎలా పిలిస్తేనేం కమ్మగా కడుపునింపే మిఠాయిల్లో మొదటి స్థానంలో ఉంటాయి. ఎదిగే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ.. బలవర్ధకమైన ఆహారం కూడా. కొలెస్ట్రాల్, షుగర్, అధిక బరువు, డైటింగ్.. అంటూ నోరుకట్టుకునే తరానికి కూడా దగ్గరవుతున్న సంప్రదాయ మిఠాయి సున్నుండ.

ఆధునిక మిఠాయిలు ఎన్నొచ్చినా.. తాతముత్తాతల నాటి వంటలవైపే మొగ్గుచూపుతున్నారు చాలామంది. దేశ, విదేశీ మిఠాయిలు విక్రయించే కార్పొరేట్ దుకాణాల్లోనూ సున్నుండలకు ఓ ప్రత్యేక షెల్ఫ్ ఉండాల్సిందే. ప్రవాసులైతే వచ్చిన ప్రతిసారీ ప్యాక్ చేసుకుని వెళ్తున్నారు.
సున్నుండలు చేయడం బ్రహ్మ విద్యేం కాదు. కాకపోతే, కాస్త అనుభవం తప్పనిసరి. పప్పు ఎంతసేపు వేయించాలి, ఏ కొలతతో బెల్లం, నెయ్యి వాడాలనేది కచ్చితంగా తెలియాలి.
చివరగా జోడించే యాలకుల సువాసన నేతి కమ్మదనానికి తోడై మరింత రుచిని ఇస్తుంది. సున్నుండలో కొందరు చక్కెర కూడా వాడతారు. కానీ, ఆరోగ్యానికి బెల్లమే మంచిది. సున్నుండ
తయారీలో వాడే మినుప పప్పు, నెయ్యి, బెల్లంలో పోషకాలు అపారంగా ఉంటాయి.

మినుప పప్పులోని ప్రొటీన్ శరీర దృఢత్వానికి సాయపడుతుంది. నెయ్యి మంచి కొవ్వును అందిస్తుంది. బెల్లం ద్వారా ఐరన్ లభిస్తుంది. రోజుకు ఒక్క ఉండ తిన్నా చాలు, ఆరోగ్యానికి కొండంత అండ అనేది ఆహార నిపుణుల మాట. మినుములు ధాతుపుష్టిని ఇచ్చి, సంతానలేమిని పోగొడతాయని చెబుతారు అమ్మమ్మలూ తాతయ్యలూ.
పెండ్లిళ్లు, పండుగలు, పూజలు, వ్రతాలు.. కార్యక్రమం ఏదైనా నలుగురూ కలిశారంటే నోరు తీపి చేసుకోవాల్సిందే. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మధుమేహం భయపెడుతున్నది. అధిక బరువు అడ్డు తగులుతున్నది. కండ్ల ముందే మిఠాయి పొట్లం ఉన్నా కడుపు కట్టేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటివారు సైతం, నిరభ్యంతరంగా సున్నుండలను రుచి చూడవచ్చని అంటున్నారు నిపుణులు. కాకపోతే, అతి సర్వత్ర వర్జయేత్ అన్న మాటను గుర్తుపెట్టుకుంటే చాలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Popcorn | పాప్కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
పళ్లెంలో పచ్చని చిత్రం..చిత్రాన్నం!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Crisis | తాగేందుకు నీళ్లు లేవు.. బాత్రూంకూ బయటకే వెళ్లాల్సిన దుస్థితి.. బషీరాబాద్ ఎస్సీ హాస్టల్లో నీటి కష్టాలు!
సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. PURE EV స్కూటీ తయారీ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
Payal Rajput | రాధికా ఆప్టే వ్యాఖ్యలకు పాయల్ రాజ్పుత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘టాలీవుడ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నా!’
Khammam SDRF | గల్లంతైన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమం.. ఒకరి కోసం గాలింపు
Jailer 2 OTT | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

