చెక్క భజన!
పండుగ పిండి వంటల్లో ఒకటిగా, రోజువారీ చిరుతిండిలో మేటిగా పేరు తెచ్చుకొన్నాయి చెక్కలు. ఒక్కసారి చేసుకుంటే పక్షంరోజుల పాటు పసందుగా లాగించవచ్చు. తెలంగాణ లోగిళ్లలో పండుగలకు వారం ముందు నుంచే చెక్కల తయారీ మొదలవుతుంది. పిల్లలున్న ఇండ్లలో చెక్కలు వండకపోతే, తల్లులకు చుక్కలు కనిపిస్తాయి. ‘అమ్మా ఆకలి!’ అన్న ప్రతిసారీ, ఓ చెక్క చేతిలో పెడితే, ఎంచక్కా ఇంటి పనులు చేసుకోవచ్చు.

ఐతారం పలారం
గారెలు, చెక్కలు, నిప్పట్లు, ఓడప్పలు, తపేళా చెక్కలు, పప్పు చెక్కలు, పిండి చెక్కలు, కారం బిళ్లలు, పప్పు బిళ్లలు.. చెక్కలకూ సహస్ర నామావళి ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.
తయారీలో వాడే పదార్థాలు అటు ఇటుగా ఉన్నా, అంతిమ లక్ష్యం మాత్రం.. కమ్మగా కరకరలాడే చెక్కలు తయారు చేయడమే. తెలంగాణలో ఏ పండుగొచ్చినా, పబ్బమొచ్చినా అప్పాలు చేయడం ఆనవాయితీ. అందులోనూ గారప్పాలు తప్పనిసరి. అంతెందుకు, ఇంట్లో పంటికిందికి ఏమీ లేకపోయినా, ఉన్నపళంగా చుట్టాలొచ్చినా ఠక్కున తట్టే ఆలోచన చెక్కలే. ఎందుకంటే నోటికి రుచీ,
కాలక్షేపానికి కాలక్షేపం, మర్యాదకు మర్యాదా!
చెక్కల తయారీలో వాడే ప్రతి పదార్థంలోనూ పోషకాలు ఉంటాయి. శరీరానికి కావలసిన పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు అపారంగా లభిస్తాయి. కారం, ధనియాల పొడి వంటి మసాలా దినుసుల వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అందుకే, కాస్త సమయం దొరికితే చాలు, అమ్మలంతా చెక్కల తయారీలో నిమగ్నమైపోతారు.
గారప్పాల తయారీలో ప్రధాన దినుసు బియ్యపు పిండి. కొన్ని ప్రాంతాల్లో గోధుమపిండి, శెనగ పిండితోనూ చెక్కలు చేస్తారు. అభిరుచిని బట్టి సాబుదానా, పుదీనా, మెంతి, పెసర పప్పు, పాలకూర, కొబ్బరి, రాగి,మిరియాలు, మసాలా చెక్కలనూ చేస్తారు.
సాయంత్రం కాగానే కరకరలాడే స్నాక్స్ కోసం.. పిల్లలేకాదు పెద్దలూ ఎదురుచూస్తారు. తరాలుగా గారప్పాలు స్నాక్స్‌కి బెస్ట్ చాయిస్‌గా మారాయి. ఆ రుచికి తిరుగేలేదు. ఈతరం పిల్లలను కట్టిపడేస్తున్న సూపర్ మార్కెట్ స్నాక్స్ కంటే రుచిలోనూ, పోషకాల్లోనూ ఎంతో మిన్న కూడా.
తెలంగాణలో సర్వపిండి తర్వాత అంతటి ఆదరణ చెక్కలకే ఉంది. పల్లీలు, పప్పులు, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కలయికతో తయారయ్యే చెక్కలు చూడగానే నోరూరిస్తాయి. ఉల్లిపాయ, సొరకాయతోనూ వెరైటీ చెక్కలు చేస్తారు. చిన్నచిన్నగా చేసే చెక్కలను ‘చిట్టి చెక్కలు’ అని పిలుస్తారు. రుచిలో మాత్రం ఇవి గట్టి చెక్కలే.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

