మామా..ఏక్ మోమో లా!

మోమో.. పేరు కొత్తగా ఉన్నా, రుచి మహత్తరం. టిబెట్, నేపాల్ వంటకమే అయినా, దేశమంతా విస్తరిస్తున్నది. యువతను ఆకట్టుకుంటున్నది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ వరకూ
బుల్లి మోమోలూ బ్రహ్మాండంగా అమ్ముడు అవుతున్నాయి. తెలంగాణ ఆవిరి కుడుములను తలపించే ఈ వంటకం పోషకాల పొట్లం.
నలుగురు స్నేహితులు కలిస్తే.. కబుర్లే కబుర్లు. మాటల మధ్యలో బజ్జీలు, పకోడీలు, సమోసాలు.. పొట్టలో చేరిపోతుంటాయి. తినేటప్పుడు బాగానే ఉన్నా, వాటివెంట వచ్చే సమస్యలు అన్నీయిన్నీ కాదు. ఆ ఎంచుకునేది ఏదో, పోషక విలువలతో కూడినది అయితే.. ఆరోగ్యం, ఆనందం. దీంతో ఫిట్నెస్ ప్రియులు మోమోలకు ఓటేస్తున్నారు.
ఇడ్లీకి చట్నీలా వీటికి మోమో సాస్ చక్కని జోడి. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. టమాటాలు, ఎండు మిరపకాయలతో తయారయ్యే ఈ సాస్ కారంకారంగా నోటికి కమ్మటి రుచిని ఇస్తుంది. రకరకాల సూప్లతోనూ మోమోలు బావుంటాయి. ఖాట్మాండులో పాలకోవా కూరి మిఠాయిలూ చేసుకుంటారు.
మధుమేహంతో, ఊబకాయంతో బాధపడేవారికి డైటిస్టులు మోమోలను సిఫార్సు చేస్తారు. ఆవిరిపై ఉడికించడం వల్ల కొలెస్ట్రాల్ గొడవ ఉండదు. కూరగాయలను ఎక్కువగా వాడటం వల్ల విటమిన్లు లభిస్తాయి. ప్రాథమికంగా మోమో మాంసాహారమే. టిబెట్ దాటి వచ్చాక శాకాహారంగా పేరు తెచ్చుకుంది.
మాంసాహార ప్రియులకోసం చికెన్, మటన్, గుడ్డు, చేపలతోనూ నాన్వెజ్ మోమోలు సిద్ధంగా ఉన్నాయి. ఆవిరిపై ఉడికించిన మోమోలని సాస్ వేసి మంచూరియాలానూ మార్చుకోవచ్చు. బేక్డ్, గ్రిల్డ్ మోమోలు కూడా ఆహార ప్రియులను అలరిస్తున్నాయి.

ఉదయం అల్పాహారానికైనా, సంధ్యా సమయంలో చిరుతిండికైనా చక్కని ఎంపిక మోమోలు. పదంటే పది నిమిషాల్లో తయారైపోతాయి. క్యాబేజీ, క్యారెట్, టమాట, ఆలుగడ్డ.. ఇలా నచ్చిన కూరగాయలతో చేసుకోవచ్చు. కాస్త నూనెలోనో, కొంచెం నీటిలోనో కూరగాయల్ని ఉడికించి తగినంత ఉప్పు, మిరియాల పొడి చిలకరించి మైదాపిండితో చేసిన చిన్నపూరీల్లో కూరి ఆవిరిపై ఉడికిస్తే చాలు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

