పళ్లెంలో పచ్చని చిత్రం..చిత్రాన్నం!
ఆకట్టుకునే రంగుతో.. అద్భుతమైన రుచితో .. నోరూరించే వంటకం చిత్రాన్నం.పులుపు, కారం కలగలిపిన ఆ రుచి ప్రతిసారీ కొత్తగానే ఉంటుంది. రాత్రి మిగిలిన అన్నానికి మేకోవర్ చేసి వడ్డించుకోవచ్చు.వేడివేడి అన్నంతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. చిటికెలో స్కూల్ బాక్సుల్లో సర్దేయవచ్చు. శ్రీమతికి సులభం. పిల్లలకు ఇష్టం. పోషకాల సమాహారం.

ఇంట్లో కాస్త అన్నం మిగిలినా, సమయానికి ఏ కూరగాయలూ అందుబాటులో లేకపోయినా, వంటకు తగినంత సమయం లేకపోయినా.. ఇల్లాలికి ఠక్కున గుర్తొచ్చేది చిత్రాన్నమే. అయిదంటే అయిదు నిమిషాల్లో వేడివేడిగా ప్లేట్లో కొలువుదీరుతుంది. పప్పులు, పల్లీలతో పండ్లకు పని చెబుతూనే, కమ్మని రుచితో పొట్ట నింపుతుంది.
చిత్రాన్నంలో పులుపుకోసం నిమ్మరసం వాడతారు. ప్రత్యామ్నాయంగా పచ్చి మామిడి, ఉసిరి, చింతకాయ తురుము వాడుకోవచ్చు. వీటి ద్వారా లభించే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపు యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. పప్పులు ప్రొటీన్లను అందిస్తాయి. ఆలస్యమెందుకు?చిత్రం.. భళారే చిత్రాన్నం అనుకుంటూ ఆరగించండి.
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చిత్రాన్నాన్ని పోపన్నం, తిరగమోతన్నం అంటారు. తయారీకి పెద్దగా సరంజామా అవసరం లేదు. నాలుగు పచ్చి మిరపకాయలు, రెండు ఎండు మిరపకాయలు, కాస్త కరివేపాకు చాలు. పల్లీలు, పప్పులు కావాలనుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. టమాట, క్యాబేజి, క్యారెట్ వంటి కూరగాయల్ని సన్నగా తరిగి వేసేవారూ ఉన్నారు. సరిపడినంత ఉప్పు, కారం, పసుపుతోపాటు చివర్లో నిమ్మరసం తప్పనిసరి.
చిత్రాన్నంలో వాడే పోపుగింజల దగ్గరనుంచి నిమ్మరసం వరకు అన్ని దినుసులూ పోషకాలను అందించేవే. అందుకే ప్రాచీనకాలం నుంచీ ఈ వంటకు అంత ఆదరణ. కొన్ని ప్రాంతాల్లో పోపులో వెల్లుల్లి వేస్తే మరికొన్ని చోట్ల ఇంగువ చిలకరిస్తారు. దీనివల్ల రుచితో పాటు సువాసన వస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది కూడా.
నాన్‌వెజ్ ప్రియులకూ చిత్రాన్నంలో వెరైటీలు ఉన్నాయి. గుడ్లను జతచేసి మసాలా దట్టించి కూడా చేసుకోవచ్చు. దీన్నే కొన్ని హోటళ్లు ఇండియన్ ఫ్రైడ్ రైస్ పేరుతో వడ్డిస్తున్నాయి. చైనీస్ ఫ్రైడ్‌రైస్ మసాలాలతో మంటపుట్టిస్తే, మన చిత్రాన్నం మాత్రం కడుపులో నిమ్మళంగా అరుగుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

