వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి
డిజిటల్ చెల్లింపుల సౌకర్యం కలిగిన సౌర శక్తితో నడిచే ఆహార విక్రయ బండిని ఐఐటీ ఖరగ్పూర్ అభివృద్ధి చేసింది.
- ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్పూర్
ఖరగ్పూర్: డిజిటల్ చెల్లింపుల సౌకర్యం కలిగిన సౌర శక్తితో నడిచే ఆహార విక్రయ బండిని ఐఐటీ ఖరగ్పూర్ అభివృద్ధి చేసింది. ప్రభుత్వ స్థలాలను శాశ్వతంగా ఆక్రమించకుండా ఈ బండిని వ్యాపారులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి నడుపుతూ వివిధ వినియోగదారుల బృందాలకు సేవలందించవచ్చు.
మూడు చక్రాలు కలిగిన ఈ బండిని శుక్రవారం సంస్థ క్యాంపస్లో ప్రారంభించిన ‘నగర ఉద్యమం – వీధి వ్యాపారి నుంచి చురుకైన పారిశ్రామికవేత్త వరకు’ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ బండిలో ఉత్పత్తులను బాగా ప్రదర్శించే సదుపాయం, మూడు మార్గాల్లో చెత్తను వేరు చేసే పద్ధతి ఉంటాయి.
తమ సంస్థ వజ్రోత్సవాల సందర్భంగా ఈ ప్రాజెక్టును రూపొందించినట్టు ఐఐటీ ఖరగ్పూర్ సంచాలకులు సుమన్ చక్రవర్తి తెలిపారు. సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం క్షేత్ర స్థాయి పరిష్కారాలకు సాంకేతికతను ఉపయోగించడంలో తమ నిబద్ధతను ఈ ఆవిష్కరణ ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ను పరీక్షించడం కోసం తమ సేతు క్లౌడ్ కిచెన్ కనెక్ట్ ప్లాట్ఫామ్తో అనుసంధానిస్తామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

