చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
విద్యావేత్తల ముసుగులో ఉన్న చైనా నిఘా ఏజెంట్లతో దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం పంచుకొన్నందుకు సీనియర్ సైనికాధికారి భార్యపై జమ్ము కశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
శ్రీనగర్ : విద్యావేత్తల ముసుగులో ఉన్న చైనా నిఘా ఏజెంట్లతో దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం పంచుకొన్నందుకు సీనియర్ సైనికాధికారి భార్యపై జమ్ము కశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తెలంగాణకు చెందిన నిందితురాలు ప్రస్తుతం జమ్ములో నివసిస్తున్నారు. అయితే తనను సంప్రదించినవారు చైనా నిఘా వర్గాలకు చెందినవారన్న విషయాన్ని గ్రహించలేక ఆమె వారితో సమాచారాన్ని పంచుకొన్నట్టు తెలిసింది.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. చైనా నిఘా ఏజెంట్లు విద్యావేత్తల్లా నటించి సైనికాధికారి భార్యను వ్యూహాత్మక, ఆపరేషనల్ అంశాలపై వ్యాసాలు రాయాల్సిందిగా కోరారు. తొలుత వారు పర్యావరణం, రాజకీయాలపై భౌగోళిక అంశాల ప్రభావం గురించి వ్యాసాలు రాయమని కోరారు. ఆ తర్వాత రక్షణ అంశాలపై వ్యాసాలు రాసేలా ఆమెను మళ్లించారు. దేశ భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపే సున్నితమైన డాటాను ఇతరులకు చేరవేయడంలో ఆమె ప్రమేయం ఉందన్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆమెపై నిఘా పెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

