అట్టుడుకుతున్న యూరప్
ప్రజాందోళనలతో యూరప్ అట్టుడుకుతున్నది. పెరుగుతున్న జీవన వ్యయం, మౌలిక సదుపాయాల లేమి, పెరుగుతున్న ఇళ్ల ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ వైఫల్యాలపై అనేక దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్, అల్బేనియాలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇటలీ, పోర్చుగల్, బెల్జియంలలో నిరసనలు జరుగుతున్నాయి.
- అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
పారిస్:ప్రజాందోళనలతో యూరప్ అట్టుడుకుతున్నది. పెరుగుతున్న జీవన వ్యయం, మౌలిక సదుపాయాల లేమి, పెరుగుతున్న ఇళ్ల ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ వైఫల్యాలపై అనేక దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్, అల్బేనియాలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇటలీ, పోర్చుగల్, బెల్జియంలలో నిరసనలు జరుగుతున్నాయి.
అల్బేనియా అల్లకల్లోకం
అల్బేనియా రాజధాని టిరానాలో ప్రధాని ఎడి రామా రాజీనామా చేయాలంటూ ఐదోరోజూ నిరసనలు కొనసాగాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, పెట్రోల్ బాంబులు, మోలోటోప్ కాక్టెయిల్స్, బాణసంచా విసరగా, పోలీసులు బాష్పవాయువు, వాటర్ కెనాన్లు, లాఠీలతో స్పందించారు. ఈ వారంలో తొలిసారిగా రబ్బరు బుల్లెట్లను ప్రయోగించినట్టు వార్తాసంస్థలు వెల్లడించాయి. విద్యార్థులు కూడా ఉద్యమంలో చేరడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.
కార్లు, చెత్తకుండీలకు నిప్పుపెట్టి రహదారులపై అడ్డంకులు సృష్టించారు. సుప్రీంకోర్టు, బ్యాంకులు, పోస్టాఫీసులు సహా పలు భవనాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, విద్యా ప్రమాణాలపై అసంతృప్తి ఈ నిరసనలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. దేశ దక్షిణ తీరంలో చేపట్టిన విలాసవంతమైన పర్యాటక ప్రాజెక్టుపైనా కొన్ని నెలలుగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ ప్రాజెక్టుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు కుష్నర్ స్థాపించిన సంస్థతో సంబంధముందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
ఇటలీలో నిరసనలు ఉద్రిక్తం
జీవన వ్యయాల పెరుగుదలకు వ్యతిరేకంగా ఇటలీలోని మిలన్, బొ లోన్యా నగరాల్లో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. మిలన్లోని ప్రధాన కేథడ్రల్ కూడలిలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. బో లోన్యాలో వాటర్ కెనాన్లను ఉపయోగించారు.
పోర్చుగల్లో ఇండ్ల అద్దెలు, ధరలపై ఆగ్రహం
పోర్చుగల్ రాజధాని లిస్బన్లో 10 వేల మంది నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇండ్ల ధరలు, అద్దెలు అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 నుంచి దేశంలో గృహాల ధరలు రెట్టింపయ్యాయని రాయిటర్స్ పేర్కొన్నది. దీంతో సామాన్య కుటుంబాలకు ఇండ్లను కొనుగోలు చేయడం, కిరాయికి తీసుకోవడం భారంగా మారింది.
బెల్జియంలో విద్యా వ్యయాలపై నిరసన
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో వందలాది మంది, ప్రధానంగా యువత వీధుల్లోకి వచ్చారు. కొందరు నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఉన్నత విద్య ఖర్చులు పెరగడం, విద్యను సామాన్యులకు దూరం చేసే అవకాశమున్న సంస్కరణలను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఈ ఆందోళన చేపట్టాయి. ఫ్రాన్స్ నిరసనల ప్రభావం తమపై పడిందని వారు పేర్కొన్నారు.
స్పెయిన్లో ఇండ్ల సమస్యపై..
పెరుగుతున్న ఇండ్ల అద్దెలు, ధరలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిని కనీస అవసరంగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో దాదాపు 7,50,000 ఇండ్లకు కొరత ఉందని తాజా నివేదిక వెల్లడించింది. ప్రధాని శాంచెజ్ కొన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించినప్పటికీ, పార్లమెంట్ వాటిని తిరస్కరించింది. దీంతో ఆయన వచ్చే ఏడాది జరపాల్సిన ఎన్నికలను వచ్చే నెలలోనే జరపాలని నిర్ణయించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

