Health tips : ఈ పప్పులతో అనారోగ్య ముప్పునకు చెక్!

న్యూఢిల్లీ : శాఖాహారుల ప్రొటీన్ అవసరాలను తీరుస్తూ సూపర్ ఫుడ్‌గా చెబుతున్న పప్పు ధాన్యాల్లో పలు ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. బరువు తగ్గడం, బీపీ, మధుమేహం నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు ఈ పప్పుల రూపంలో మనకు అందుతాయి.
పెసరపప్పు: అత్యధిక ప్రొటీన్‌తో ఆరోగ్యకరమైన పప్పుగా పెసరపప్పు ముందువరసలో ఉంటుంది. రైస్, రోటీతో పాటు పెసరపప్పుతో చేసిన దాల్‌ను తీసుకోవచ్చు.. 100 గ్రాముల పెసరపప్పులో ఏకంగా 24 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.
కందిపప్పు : పప్పు ధాన్యాల్లో ముందుగా గుర్తుకువచ్చే కందిపప్పు కూడా పోషకాల గని. కందిపప్పులో ఐరన్, క్యాల్షియం, ఫోలేట్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వందగ్రామల కందిపప్పులో 22 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది హృద్రోగులు, గర్భిణులు, మధుమేహులకు చాలా మేలు చేస్తుంది.
మినపప్పు : తక్షణ శక్తినిచ్చే మినపప్పులో ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, బీ-విటమిన్లు ఉండటంతో వీటిని తరచూ తీసకుంటే ఎముకలు, నరాల పుష్టికి మేలు చేస్తుంది. మెరుగైన జీర్ణశక్తి, గుండె ఆరోగ్యానికీ ఉపకరిస్తుంది.
శనగపప్పు : శనగల్లో ఉండే ఐరన్, క్యాల్షియం, పొటాషియం, ఫైబర్, ప్రొటీన్ మెరుగైన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మధుమేహులు, హృద్రోగులతో పాటు రక్తపోటు బాధితులకూ శనగలు మంచి ఆహారం. అరకప్పు శనగల్లో 9 గ్రాముల ఫైబర్ ఉండటంతో మలబద్ధకంతో బాధపడేవారికీ శనగలు మేలు చేస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

