telangana irrigation day | ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్విరామ కృషి.. ఇంజినీర్ల అవిశ్రాంత శ్రమ.. వెరసి తెలంగాణ సాగునీటి రంగం స్వరూపమే మారిపోయింది. అద్భుత సాంకేతిక ఆవిష్కరణలకు రాష్ట్రం వేదికగా నిలుస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇరిగేషన్ ఇంజినీర్ల కెరీర్లో, తెలంగాణ సాగునీటి రంగంలో.. ఇదొక సువర్ణాధ్యాయం’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటి మహిళా చీఫ్ ఇంజినీర్ శ్రీదేవి. ‘తెలంగాణ ఇరిగేషన్ డే (
telangana irrigation day )’ సందర్భంగా ‘జిందగీ’తో తన భావాలను పంచుకొన్నారామె.
మాది ఖమ్మం జిల్లా. నాన్న జుజ్జవరపు సుధాకర్, అమ్మ సుశీల. నేను ఇంజినీర్ కావాలన్నది నాన్న ఆకాంక్ష. ఆయన ప్రోత్సాహంతోనే ఇంజినీరింగ్ చదివాను. 1997లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను. పద్నాలుగేండ్లు అక్కడే పనిచేశాను. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా చీఫ్ ఇంజినీర్‌గా ప్రమోషన్ పొందడంతో పాటు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ అయ్యాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ సీఈగా నన్ను నియమించారు. సాగునీటి పారుదలశాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన
ఆపరేషనల్ అండ్ మెయింటెనన్స్ డిపార్ట్మెంట్లో సీఈగా ఏడాది కాలం నుంచీ విధులు నిర్వర్తిస్తున్నా.
నా ఇన్నేళ్ల ఇంజినీరింగ్ జీవితాన్ని చూసుకుంటే.. తెలంగాణ ఏర్పాటుకు ముందు, ఆ తరువాత అని ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. సమాజ ప్రగతిలో ఇంజినీర్ల పాత్ర అత్యంత కీలకం. అలాంటి ఇంజినీర్లు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల వల్ల అస్తిత్వాన్నే కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. ముఖ్యమంత్రి మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ శ్రేణి అద్భుతమే కాదు, తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లకు సమాజంలో సమున్నత స్థానాన్ని కల్పించింది. కేసీఆర్ కార్యదక్షత.. దూరదృష్టి.. వెరసి ఏడేండ్ల్ల స్వల్పకాలంలోనే తెలంగాణ జల మాగాణంగా మారిపోయింది. తెలంగాణ సాగునీటి పారుదలశాఖ చరిత్రలోనే ఇదొక సువర్ణాధ్యాయం.
తెలంగాణ ఏర్పాటు తరువాత మహిళా ఇంజినీర్లకు మంచిరోజులు వచ్చాయి. ఉమ్మడి పాలనలో మహిళా ఇంజినీర్లు, అందులోనూ తెలంగాణకు చెందినవారు కార్యాలయాలకే పరిమితమయ్యారు. ఎవరికో ఒకరికి మాత్రమే క్షేత్ర స్థాయిలో పనిచేసే అవకాశం లభించేది. ప్రస్తుతం, పదుల సంఖ్యలో మహిళా ఇంజినీర్లకు అవకాశాలు లభిస్తున్నాయి.
తెలంగాణ సాగునీటి శాఖలో ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించడం అన్నది గర్వంగానూ, అంతకుమించి ఆనందంగానూ ఉంది. సాగునీటిశాఖ ఏడేండ్ల శ్రమ ఫలితాలు కండ్ల ముందు కనబడుతుంటే మనసు సంతోషంతో పొంగిపోతున్నది. ఒకనాడు సిరిసిల్ల ప్రాంతంలో నేను నెర్రెలుబారిన నేలలను చూసిన. ఇప్పుడు, ఎక్కడా ఒక్క గుంట ఖాళీ లేకుండా పచ్చదనం పరుచుకున్నది. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగామంటే.. అదంతా ముఖ్యమంత్రి కార్యదక్షత, సాగునీటిశాఖ ఇంజినీర్ల సమష్టి కృషి ఫలితమే. ఈ మహా యజ్ఞంలో నేనూ భాగమైనందుకు గర్వంగా ఉంది.
…? మ్యాకం రవికుమార్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
darpan ahluwalia | పోలీస్ అకాడమీలో పరేడ్ కమాండర్‌గా నడిపించబోతున్న ఈమె గురించి తెలుసా
ekta kapoor | మరో కొత్త బిజినెస్‌లోకి బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్
PV sindhu |పద్మభూషణ్ అందుకున్నప్పుడు పీవీ సింధు కట్టుకున్న చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్‌బాలీ ఆభరణాలు.. వీటిని మించిన ఫ్యాషన్ లేనే లేదు
ఫ్యాషన్ రంగంలో ఇప్పుడామె ఓ ట్రెండ్ సెట్టర్.. తొమ్మిదేళ్ల క్రితం ధైర్యం చేయకపోయుంటే మాత్రం..
jai bhim | చినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఎవరు? ఆమెకు ఎలా అవకాశం వచ్చింది?