e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News ఢిల్లీలో జ‌రిగే గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో కూచిపూడి ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌బోతున్న తెలంగాణ ఆడ‌బిడ్డ‌ గురించి తెలుసా

ఢిల్లీలో జ‌రిగే గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో కూచిపూడి ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌బోతున్న తెలంగాణ ఆడ‌బిడ్డ‌ గురించి తెలుసా

Seetha prasad
Seetha prasad

Seetha prasad | ఆమె కాలికి గజ్జె కడితే ప్రేక్షకుల గుండెలు ఘల్లుమంటాయి. ఆమె జడను సింగారించుకుంటే సత్యభామ అసూయతో మూతి తిప్పుతుంది. ఆమె కాటుక దిద్దుకుంటే ఆ విశాల నేత్రాలు కారుమేఘాలతో పోటీపడతాయి. ఆమె అడుగులకు మగమయూరాలు మడుగులొత్తుతాయి. కొత్తగూడెం నృత్యకారిణి డాక్టర్‌ సీతాప్రసాద్‌ నేతృత్వంలోని కళా బృందం జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనుంది.

Seetha prasad
Seetha prasad

కొత్తగూడేనికి చెందిన కూచిపూడి నృత్యకారిణి మధురాపంతుల సీతాప్రసాద్‌. ఆమె తన ఇరవై ఎనిమిదేండ్ల నాట్య ప్రస్థానంలో ఎంతోమంది శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దారు. సీతాప్రసాద్‌ స్థాపించిన దుర్గసాయి నృత్య నికేతన్‌ కూచిపూడి విజ్ఞాన సర్వస్వం. ‘ఆజాదీ కా అమృత మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యరూపక పోటీల్లో దుర్గసాయి నృత్య నికేతన్‌ జిల్లా స్థాయిలో ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలోనూ గెలిచి జోనల్‌ స్థాయికి వెళ్లింది. అక్కడా తిరుగులేని ప్రతిభను చాటి జాతీయ స్థాయికి చేరుకుంది. గ్రాండ్‌ ఫినాలేలోనూ డాక్టర్‌ సీతాప్రసాద్‌ విద్యార్థి బృందం ప్రతిష్ఠాత్మక ‘రాజ్‌పథ్‌’ ప్రదర్శనకు అర్హత సాధించింది. గణతంత్ర దినోత్సవం నాడు, మహామహుల సమక్షంలో కొత్తగూడెం బృందం తెలంగాణ కళా ప్రతిభను ప్రపంచానికి చాటనుంది.

Seetha prasad
Seetha prasad

ఏడు దేశాల్లో ప్రదర్శనలు

- Advertisement -

డాక్టర్‌ సీతాప్రసాద్‌ దూరదర్శన్‌లో గ్రేడ్‌ 1 ఆర్టిస్టుగా పనిచేశారు. మధు నిర్మల, వేదాంతం వెంకటాచలం, వెంపటి రవిశంకర్‌ శిష్యరికంలో కూచిపూడి నృత్య ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు. దుర్గసాయి నృత్య నికేతన్‌ ఛత్రం కింద ఇప్పటివరకూ దాదాపు ఐదువందల మంది విద్యార్థినులకు శిక్షణ అందించారు. దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలూ పురస్కారాలూ పొందారు. ఉజ్జయిని కుంభమేళాలో తన అందెల రవళితో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రోహిణి చేతుల మీదుగా స్త్రీశక్తి పురస్కారం అందుకున్నారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ చట్టసభ ‘ద హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’ నుంచి ఆహ్వానాన్ని అందుకొన్న అరుదైన ఘనతనూ సాధించారు. ‘ప్రతి ఒక్కరిలోనూ కళా ప్రతిభ ఉంటుంది. దానిని వెలికితీయాలి. అప్పుడే మన గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. నా విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలన్నదే నా ఆరాటం’ అంటారు సీతాప్రసాద్‌.

Seetha prasad
Seetha prasad

…✍ కాగితపు వెంకటేశ్వరరావు

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఆస్ట్రేలియా స్థానిక‌ ఎన్నిక‌ల్లో గెలిచిన తెలంగాణ ఆడ‌బిడ్డ‌.. ఆమె విజ‌య ర‌హ‌స్య‌మిదే..

gauthami jeji | బొల్లి మ‌చ్చ‌లు ఉన్నాయ‌ని కుంగిపోలేదు.. మోడ‌లింగ్‌లో అద‌ర‌గొడుతుంది..

Keerthi priya | రైత‌న్న‌ల‌కు అండ‌గా సూర్యాపేట యువ‌తి.. ఇంత‌కీ ఆమె ఏం చేస్తోందంటే..

nalli fashions | తాత‌ల నుంచి చేస్తున్న చీర‌ల వ్యాపారానికి ఈమె బ్రాండ్ క్రియేట్ చేసింది

Vijayalakshmi | చ‌దివింది ప‌దో త‌ర‌గ‌తే కానీ.. చేసేది కోట్ల బిజినెస్‌

Gray hair | చిన్న‌వ‌య‌సులోనే త‌ల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్‌స్పిరేష‌న్‌.. ఎందుకంటే?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement