Floral Print Organza | ఫ్యాషన్ ప్రియులు. ట్రెండీగా ఉండేందుకు ఇష్టపడతారు. దాంతోపాటే సౌకర్యాన్నీ కోరుకుంటారు. వెస్ట్రన్ లుక్ అంటే మోజుపడేవారికి కూడా నప్పేలా తేలికైన ఫ్లోరల్ ప్రింట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన డిజైన్స్ మీ కోసం..
నిండైన నేరేడు పండు (పర్పుల్) రంగు ఆర్గంజా వస్త్రంతో డిజైన్ చేసిన డ్రెస్ ఇది. లెహంగా కోసం ఫ్లోరల్ ప్రింట్ ఫ్యాబ్రిక్‌కు గులాబీ వన్నె నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌పై మిర్రర్ మగ్గం వర్క్ బార్డర్ జతచేశారు. వెస్ట్రన్ లుక్ కోసం షార్ట్ క్రాప్ టాప్ ఇచ్చారు. బార్డర్‌లోని డిజైన్‌తోనే కాలర్ నెక్ ఇవ్వడంతో కాంట్రాస్ట్ లుక్ వచ్చింది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి మిర్రర్ మగ్గం వర్క్ జతచేశారు. హ్యాండ్‌మేడ్ బటన్స్వల్ల పాశ్చాత్య సోయగం వచ్చింది. పార్టీలు, ఫంక్షన్లకు బావుంటుంది.
నేవీ బ్లూ ఫ్లోరల్ ప్రింట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. హై అండ్ లో శైలిలో రూపొందించిన ఈ ఫ్రాక్‌కు కాలర్ డ్రాప్ కట్ ఇచ్చి ఫుల్ చుడీ హ్యాండ్స్ జతచేశారు. టాప్ అండ్ బాటమ్ సేమ్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసి, బాటమ్‌కు సర్క్యులర్ కట్ ఎంచుకున్నారు. వేవ్ లుక్ కోసం నాలుగు అంగుళాల కెన్కెన్ బార్డర్ జత
చేశారు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌కు నప్పే స్కిన్ టైట్ ప్యాంట్ ప్రత్యేక ఆకర్షణ.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
“లెదర్‌తో తయారు చేసిన బ్యాగులు, బెల్టులు మాత్రమే కాదు.. జువెల్లరీ కూడా ఫేమస్సే !!”