Western look Frocks | మామూలు రోజుల్లో ఎలా ఉన్నా పార్టీల్లో మాత్రం ప్రత్యేకంగా కనపడాలని ఆరాటపడతారు అమ్మాయిలు. అలాంటి సందర్భాలకు వెస్ట్రన్లుక్లో డిజైన్ చేసిన ట్రెండీ ఫ్రాక్స్..
బ్లూ కలర్ ప్లెయిన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. ట్రెండీలుక్ కోసం నెక్‌ను వన్‌సైడ్ షోల్డర్తో డిజైన్ చేశారు. యోక్పార్ట్ హైలైట్ అయ్యేలా గోల్డ్ కలర్ బీడ్స్, త్రెడ్‌తో మగ్గం వర్క్ చేశారు. బాటమ్ పార్ట్‌ను అదే ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసి ప్రిల్స్ జతచేశారు. బాడీపార్ట్తో కాంట్రాస్ట్ కోసం.. బాటమ్‌లో గోల్డ్ బార్డర్ జతచేశారు. పార్టీలకు చక్కని ఎంపిక.
వెస్ట్రన్వేర్లో ఎవర్గ్రీన్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్. ఫ్లోరల్ ప్రింట్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో మల్టిపుల్ లేయర్లతో ఈ ఫ్రాక్ను డిజైన్ చేశారు. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్‌తో.. టాప్ అండ్ లోయర్‌లో లాంగ్ అండ్ షార్ట్ లేయర్స్ ఇచ్చి మధ్యలో ప్లెయిన్ రెడ్ లేయర్‌తో హైలైట్ చేశారు. వేవ్లుక్ కోసం పైపింగ్ చేసి బౌన్సీలుక్ కోసం ప్రిల్స్ జతచేశారు. స్లీవ్‌లెస్ హ్యాండ్స్ ఇచ్చి చిన్నప్రిల్స్తో నెక్‌ను హైలైట్ చేశారు. చిన్నచిన్న పార్టీలకు, వేడుకలకు బావుంటుంది.
రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Frocks | కాలేజీ, ఆఫీసులకు వెళ్లే మగువలను ఆకర్షిస్తున్న నయా గౌన్లు”