వాలుజడలోనే కాదు.. వన్నెల దుస్తులపైనా ఇప్పుడు పుష్ప సోయగమే నయా ఫ్యాషన్
Fashion | వాలుజడలోనే కాదు, వన్నెల దుస్తులపైనా పుష్ప సోయగం ఆకట్టుకుంటుంది. కలర్‌ఫుల్ ఫ్లోరల్ ప్రింట్‌తో లైట్ వెయిట్ లాంగ్ ఫ్రాక్స్ను మెట్రో యువతులు మరింత ఇష్టపడుతున్నారు.
పొట్లీ జతగా..
లైట్ లెమన్ ఎల్లో షిఫాన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. లెమన్ ఎల్లోకు కాంట్రాస్ట్‌గా రెడ్, గ్రీన్, పింక్, ఎల్లో కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్ చేశారు. ఈ లాంగ్ ఫ్రాక్‌లో అదే ఫ్యాబ్రిక్‌తో బాడీ, బాటమ్ పార్ట్ డిజైన్ చేశారు. బాడీపార్ట్లో నెక్లైన్ దగ్గర్నుంచి వెయిస్ట్ వరకు గ్రీన్ కలర్ పొట్లీ వర్క్ ఇచ్చారు. రౌండ్నెక్పై రెడ్ కలర్ పైపింగ్ చేయడంతో హైలైట్ అయ్యింది. సేమ్ ఫ్యాబ్రిక్‌తో ఇచ్చిన డబుల్ లేయర్ రఫుల్ హ్యాండ్స్ అదనపు ఆకర్షణ.
హైరౌండ్ నెక్‌తో..
లైట్ ఆరెంజ్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఫ్రాక్ ఇది. డార్క్ ఆరెంజ్ కలర్‌తో ఫ్లోరల్ ప్రింట్ చేశారు. బాడీ, బాటమ్.. సేమ్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసి ప్రిల్స్ జతచేశారు. గేరాలో సర్క్యులర్ కట్ ఇచ్చారు. బాడీపార్ట్కి హైరౌండ్ నెక్, మిడిల్లో ఓవెల్ కట్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ రా సిల్క్‌ను ప్యాచ్‌లా జతచేశారు. దానికి రెండువైపులా.. నెక్లైన్ నుంచి నడుము వరకు సీక్వెన్స్‌తో చేసిన మగ్గం వర్క్ బావుంది. డబుల్ లేయర్ రఫుల్ హ్యాండ్స్ అదనపు ఆకర్షణ.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read More :
“Modular Jewellery | పెళ్లయినా.. ఎంగేజ్మెంట్ అయినా ఈ నగలే బెస్ట్ ఛాయిస్!!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

