Modular Jewellery | పెళ్లయినా.. ఎంగేజ్మెంట్ అయినా ఈ నగలే బెస్ట్ ఛాయిస్!!
Modular Jewellery | ఒక్కో సందర్భానికి ఒక్కో రకమైన ఆభరణాలు బావుంటాయి. పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి చిన్నపాటి ఫంక్షన్లకు తేలికైన నగలు సూపర్. నిశ్చితార్థం, పెండ్లి వంటి సందర్భాల్లో భారీభారీ నగలు నిండుగా అనిపిస్తాయి. అలా అని, అన్నేసి ఆభరణాలు కొనలేం. ఈ సమస్యకు పరిష్కారమే.. మాడ్యులర్ జువెలరీ. ఏ సందర్భానికైనా నప్పేలా వాటిని మలుచుకోవచ్చు. చిన్నగా, సన్నగా, భారీగా సర్దుబాటు చేసుకోనూవచ్చు.

క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్. ఆమె స్వభావమే అంత. కొన్నిసార్లు ట్రెడిషనల్ జువెలరీని కోరుకుంటుంది. మరోసారి లైట్ వెయిట్ ఇష్టపడుతుంది. ఆ చిత్తానికి తగినట్టు కొత్త రూపాన్ని సంతరించుకునే శక్తి మాడ్యులర్ జువెలరీకి ఉంది. హారం గొలుసుగా, గొలుసు బ్రేస్లెట్గా, చోకర్ కాస్తా వడ్డాణంగా, వంకీగా.. రకరకాలుగా మారిపోతుంది. ఈ ఆభరణాలను ఎలా అయినా తీర్చిదిద్దుకోవచ్చు. భారీగా, నిండుగా ధరించాలని అనుకున్నప్పుడు నగకు మరిన్ని పూసలు, గొలుసులు, పెండెంట్లను జత చేసుకోవచ్చు. వద్దనుకుంటే తీసేయనూవచ్చు. వెస్ట్రన్ దుస్తులపైనా, సంప్రదాయ చీరలపైనా ఒకేలా నప్పుతాయివి. భారీతనం కోసం.. సందర్భాన్ని బట్టి దుద్దులకు జుంకాలను, పూసలను జతచేయవచ్చు.

అన్ని హంగుల్లోనూ..
బంగారం, వెండి, ప్లాటినమ్ వంటి లోహాలతోనే కాకుండా ఫ్యాబ్రిక్, త్రెడ్, టెర్రకోట ఆభరణాల్లోనూ మాడ్యులర్ జువెలరీ లభిస్తున్నది. సంప్రదాయ దుస్తులకు నప్పేలా భారీ పరిమాణంలో రత్నాలు, రాళ్లు, పూసలు పొదిగినవీ ఉన్నాయి. ట్రెండీవేర్పై ధరించేందుకు వీలుగా ప్లెయిన్, ఫ్యాషనబుల్ నగలూ వచ్చాయి. ఎంపిక మీ ఇష్టం. ఇక్కడ ఉన్న హారాన్ని వడ్డాణంగానూ, అందులోని లాకెట్లను చోకర్గానూ, పెద్ద పెండెంట్గానూ విడివిడిగా పెట్టుకోవచ్చు.

Read More :
“Mother of Pearl Jewellery | వజ్రాలను మరిపించేలా మెరిసే ఆల్చిప్ప ఆభరణాల గురించి తెలుసా !!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

