Choker Necklace | తాతమ్మల కాలం నాటి కాసుల పేరు అమ్మాయిలకు నచ్చిన నగగా మారి చాలా రోజులే అయ్యింది. పెళ్లికూతుళ్ల మెడలోను, కాలేజీ అమ్మాయిల జువెలరీ బాక్స్లోనూ చేరిపోయింది. చిన్నా పెద్దా కాసులతో, రకరకాల రాళ్లను పొదిగిన కాసుల హారాలు మోడ్రన్ లుక్నూ సంపాదించుకున్నాయి. ఇప్పుడు మరింత ట్రెండీగా.. కాసుల నగను చోకర్ లుక్లో తీసుకొస్తున్నారు ఆభరణాల డిజైనర్లు.
ఫ్యాషనబుల్ చోకర్లో కొన్ని కాసులను చేర్చో, అచ్చంగా కాసులతోనే చోకర్ను రూపొందించో.. మన ముందుకు తెస్తున్నారు. రాళ్లు, ఎనామిల్లాంటి వాటిని జోడించి మరింత అందాన్ని ఆపాదిస్తున్నారు. లక్ష్మీ కాసులతో పాటు వివిధ డిజైన్లు చెక్కిన కాసులు మగువల్ని కట్టిపడేస్తున్నాయి. వీటిలో పచ్చలు, కెంపులు, కుందన్లు, వజ్రాలతో పాటు రకరకాల రంగురాళ్లను పొదిగి ఇంకొంచెం ఆకర్షణను ఆపాదిస్తున్నారు. సహజత్వం కోసం.. మువ్వలు, ముత్యాలు కూడా వేలాడదీస్తున్నారు. సంప్రదాయంగా కనిపిస్తూనే ట్రెండీగా అనిపించడం కాసుల చోకర్లకే సాధ్యం!
Stone Carving Jewellery | ఈ రాతి నగలు ధరిస్తే ఆరోగ్యానికి ఇన్ని లాభాలా?”