అతివలు అంతగా ఇష్టపడి ధరించే ఆమ్రపాలి నగల స్పెషాలిటీ ఏంటి?
Amrapali Jewels | చరిత్రను చెక్కిన చక్కని మూర్తి ఆమ్రపాలి. కనీవినీ ఎరుగని కళాకృతులతో రూపుదిద్దుకున్న ఆభరణాలు ఆమె పేరుతో చరిత్రకెక్కాయి. బుద్ధుడి సమకాలీనురాలు ఆమె. శతాబ్దాలుగా వన్నె తరగని యాంటిక్ నగలకు కేరాఫ్ ఆమ్రపాలి. మొత్తానికి ఒక స్త్రీమూర్తి పేరిట వగలు పోతున్న నగలను నేటి స్త్రీలూ మెచ్చకుండా ఉండలేరు. అతివలు ఇష్టంగా ధరించే ఆమ్రపాలి నగధగలు మనమూ చూసేద్దాం.

సంప్రదాయ కళాకృతులతో తీర్చిదిద్దితేనేం ఆమ్రపాలి ఆభరణాల తళుకుల ముందు ఈ తరం నగలు వెలవెలబోతాయి. ఆధునిక యుగంలోనూ కొత్త ఒరవడి సృష్టిస్తూ వీటిని ఇష్టంగా ధరిస్తున్నారు అతివలు. భారతీయ సంప్రదాయంలో ఆలయాలది ప్రముఖ స్థానం. శిఖరం నుంచి సోపానాల వరకు రాతిపరుపుపై మలిచిన కళాఖండాలు ఆలయ వైభవాన్ని చాటి చెబుతాయి. ఆ కళారూపాలనే అణువణువూ పొదుగుకొని ఆమ్రపాలి ఆభరణాలు దర్పంగా దర్శనమిస్తాయి. గాలిగోపురంపై చెక్కిన చిలుక రూపు వంకీలపై పునఃప్రతిష్ఠితం అవుతుంది. గుడి కుడ్యాలపై వెలసిన రాయంచల ద్వయం ఒడ్డాణాలపై ఒదిగిపోతుంది. శిల్పకళకు చిరునామాగా నిలిచిన తంజావూరు లాంటి ప్రముఖ ఆలయాల్లోని రకరకాల కళాకృతులన్నీ ఆమ్రపాలి నగల్లో మెరిసిపోతూ అచ్చెరువొందిస్తాయి.

మరింత అందంగా
దేవాలయాలపై కదలక మెదలక నిల్చున్న ఆకృతులే కాదు, ఆలయాల్లో స్థిరంగా ఉన్న దేవతా మూర్తుల రూపాలు సైతం ఆమ్రపాలి నగలపై తళుక్కుమంటున్నాయి. అందంగా ఎదిగిన తరువులు, వాటిని పెనవేసుకున్న తీగలు, వాటికి విరబూసిన విరులు, ఆ సోయగాన్ని చూసి పురివిప్పి ఆడే మయూరాలు ఇలా ప్రకృతి సంపదంతా ఆమ్రపాలి ఆభరణాలకు కొత్త కళను కట్టబెట్టింది. ద్వారానికి కట్టిన తోరణాన్ని పోలిన జుంకాలు, గిజిగాడి గూడును మరిపించే బుట్టాలు, విలక్షణమైన కంఠాభరణాలు కోకొల్లలుగా బోషాణంలో చోటుకోసం ఎదురుచూస్తున్నాయి. ముత్యాలు, పగడాలు, రత్నాలు పొదిగిన రకరకాల ఆభరణాలు మగువల మెడలో అలరారేందుకు తహతహలాడుతున్నాయి. ఈ తరానికి తగ్గట్టు కుందన్, జర్దోజీ వంటి అదనపు హంగులు అద్దుకున్న హ్యాండ్‌మేడ్ నగలకు మంచి ఆదరణ లభిస్తున్నది.

అన్నీ అందంగానే..
బంగారంతోనే కాకుండా వెండితోనూ ఈ డిజైనర్ నగలను తయారు చేస్తున్నారు. బంగారుపూతతో ఇవి అలరిస్తున్నాయి. అంతేకాదు రకరకాల ఆదివాసీ సంప్రదాయ ఆభరణాలూ ఆమ్రపాలి నగలుగా పరివర్తనం చెందుతున్నాయి. భారీ కంఠాభరణాలు, చెవినిండా ఒదిగిపోయే ఇయర్ కఫ్స్, రకరకాల పెండెంట్లు, సహజంగా దొరికే రాళ్లు, పూసలు, ముత్యాలు, రత్నాలు పొదిగిన ఆభరణాలు అతివలకు వల విసురుతున్నాయి. భారీతనం ఉట్టిపడే ఈ నగలను పెండ్లి, నిశ్చితార్థం వంటి శుభకార్యాలతోపాటు సంప్రదాయ వేడుకలలో ధరించడానికి ఆసక్తి కనబరుస్తారు. చారిత్రాత్మక చిత్రాల్లోనూ ఆమ్రపాలి నగల సోయగాలు కనిపిస్తాయి. కరీనా కపూర్, మాధురీ దీక్షిత్, అదితీరావు తదితర కథానాయికలు ఈ నగలను సినిమాల్లోనే కాకుండా ఇతర వేడుకల్లోనూ ధరించి కనిపిస్తుంటారు.

Read More :
ఇక మీ ఇంటి తాళాన్ని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా లాక్ చేయొచ్చు”
One Gram Gold Jewellery | వన్‌గ్రామ్ గోల్డ్ నగలను ఇప్పుడు మీకు నచ్చినట్టుగా చేయించుకోండి!!”
Unfinished Jewelry | చివర్లను కలపకుండా సగంలో వదిలేయడమే ఇప్పుడు ఫ్యాషన్”
హైదరాబాదీ కళలను ఆకట్టుకుంటున్న ఈ అరబిక్ డిజైన్స్ గురించి తెలుసా”
Jewelry | చేతితో ప్రాణంపోసిన ఆభరణాలు ఎందుకంత ప్రత్యేకం !!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

